విజయదశమి సందర్భంగా ‘GEN Z GIRLS’ టైటిల్ అనౌన్స్మెంట్
‘నల్లమల్ల’, లాంటి విభిన్న మైన చిత్రం తో గుర్తింపు తెచ్చుకున్న రవి చరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు, అలాంటి డైరెక్టర్ జోనర్ మార్చి కొత్త కథాంశంతో ‘GEN Z GIRLS’ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు.
ఎస్‌జేసీ క్రియేషన్స్ (శ్రీ జ్యోతిర్మయి క్రియేషన్స్) బ్యానర్‌పై మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బ్యానర్లో ప్రొడక్షన్ నంబర్ 1గా రూపొందుతున్న ‘GEN Z GIRLS’ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేసింది.
పండుగ సందర్భంగా పోస్టర్‌ను విడుదల చేసి,షూటింగ్‌ను అతి త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది, ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, కథాంశం, ఇతర సాంకేతిక వివరాలను చిత్ర యూనిట్ త్వరలో వెల్లడించనుంది.
‘GEN Z GIRLS’ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.



