‘మెట్రోలవర్’ సినిమా చూశాను. చాలా బావుంది. పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను: టీజర్ లాంచ్ ఈవెంట్ లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన
‘మెట్రో లవర్’ చాలా పాషన్ తో చేసిన సినిమా. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది: భీమ్స్ సిసిరోలియో
నరేన్ వనపర్తి, భీమ్స్ సిసిరోలియో మ్యూజికల్ ‘మెట్రో లవర్’ టీజర్ లాంచ్ – నవంబర్ 20న థియేటర్స్ లో రిలీజ్
నరేన్ వనపర్తి, సాహితీ అవంచ ప్రధాన పాత్రల్లో మహేష్ నాంపెల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మెట్రో లవర్’. KMC ప్రొడక్షన్స్ & ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మాల్య కందుకూరి, శివకుమార్ రాజంపేట, గడ్డం రవి కుమార్, సంతోష్ జాదవ్ నిర్మిస్తున్నారు. స్టార్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. నవంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నరేన్, మాల్య నాకు ధమాకా సినిమా నుంచి పరిచయం. వారి మెట్రో లవర్ సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉంది. నరేన్‌కి సినిమా అంటే చాలా ప్యాషన్. ఈ టీజర్లో ఆ ప్యాషన్ కనిపిస్తోంది. ఒక సినిమా చేసి రిలీజ్ చేయడం పెద్ద సాహసం. మంచి డేట్ చూసుకుని రిలీజ్ చేసుకోవాలి. ఈ సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. కథ, భీమ్స్ మ్యూజిక్, కెమెరా వర్క్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. నరేన్ చాలా ప్యాషన్‌తో చేశాడు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
హీరో నరేన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. భీమ్స్‌తో ఇరవై ఏళ్ల స్నేహం. తను మా ఫ్యామిలీ. కిరణ్ అన్న చెప్పిన ఈ కథ నాకు చాలా నచ్చింది. మా నిర్మాతలు ఎంతగానో సహకరించారు. భీమ్స్ పెద్ద సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్నారు. అలాంటి ఆయన మా సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం, అలాగే కథలో కూడా కొన్ని కీలక సూచనలు ఇవ్వడం మాకు ఎంతగానో ఉపయోగపడింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్యూ. ఇది నెక్స్ట్ లెవల్ స్టోరీ. సినిమా చూసి చాలా సర్ప్రైజ్ అవుతారు. ఇది నాకు రెండో సినిమా. నా తొలి సినిమాకి అందరూ ఎంతగానో ప్రోత్సహించారు. ఈ సినిమాకి కూడా మీ సపోర్ట్ కావాలి. ఖచ్చితంగా ఆడియన్స్‌ను అలరిస్తాం.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ స్టేజ్ మీద ఉన్న మా హీరో, నిర్మాతలు అందరూ కూడా ఒక కుటుంబ సభ్యుల్లాంటి వాళ్లం. నరేన్ తో ఇరవై ఏళ్లుగా స్నేహం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరం ఉమ్మడిగా చేసిన సినిమా ఇది. ఇది మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. చాలా నిజాయితీగా ఈ సినిమా చేశాం. టీం అందరూ ఎంతగానో కలిసికట్టుగా చేశాం. ‘మెట్రో లవర్’ ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. ఇది చూసే వారికి ఆలోచింపజేసే సినిమా. పద్ధతి గల సినిమా. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. నరేన్ నాకు తెలుసు. తన తొలి సినిమాకి మంచి పేరు వచ్చింది. తనకి సినిమా అంటే చాలా ప్యాషన్. టీజర్ చాలా అద్భుతంగా ఉంది. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. హిట్ అవుతుందనే నమ్మకం కలిగించింది. కంటెంట్ ఉన్న సినిమాలు హిట్ అవుతున్నాయి. ఈ సినిమా కూడా ఆ కోవలోకి వస్తుందని నమ్ముతున్నాను. భీమ్స్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. టీం అందరికీ అభినందనలు.
డైరెక్టర్ మహేష్ నాంపల్లి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చాలా మంచి కంటెంట్ వస్తోంది. సినిమా అంచనాలకు మించి ఉంటుంది. ఇలాంటి కథ ఇప్పటివరకు రాలేదు. భీమ్స్ అన్న సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం మా అదృష్టం. టీం అందరికీ థాంక్యూ. సినిమా ఖచ్చితంగా చాలా బాగుంటుంది.
నిర్మాతలు మాట్లాడుతూ.. భీమ్స్ గారికి, త్రినాథరావు గారికి, బెక్కం వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు. నరేన్ చాలా మంచి వ్యక్తి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చాలా మంచి కథ. చాలా కొత్త కథ. ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో చిత్ర బృందం సభ్యులందరూ పాల్గొన్నారు.
తారాగణం: నరేన్ వనపర్తి , సాహితీ అవంచ, సుహానా, జగదీష్ , అవినాష్, మురళీధర్ గౌడ్, పృధ్వి రవి ఆంథోని, సుజాత, జెమినీ సురేశ్
బ్యానర్: KMC ప్రొడక్షన్స్ & ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: మాల్య కందుకూరి, శివకుమార్ రాజంపేట, గడ్డం రవి కుమార్, సంతోష్ జాదవ్,
దర్శకుడు: మహేష్ నాంపెల్లి
క్రియేటివ్ డైరెక్టర్ : VG రాజేష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
కథ: కిరణ్జీవి
డైలాగ్స్: కిరణ్జీవి, రాంరెడ్డి కర్నాటి, దేవ్.
DOP: వై ఎస్ కృష్ణ
ఎడిటర్: శివ శర్వాణి
ప్రొడక్షన్ డిజైనర్: వై శివ కృష్ణ
ఆర్ట్ డైరెక్టర్: పెద్ది రాజు
కొరియోగ్రాఫర్: దుర్గేష్ మాస్టర్
ఫైట్స్ : నభా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహేష్ మణి ఆర్
మార్కెటింగ్: హ్యాష్‌ట్యాగ్ మీడియా
PRO: వంశీ-శేఖర్



