‘JAILER 2’ ట్రైలర్ విడుదల మరింత భారీగా, మరింత వైల్డ్‌గా ‘జైలర్ 2’ యాక్షన్ స్పెక్టాకిల్

0
9

‘JAILER 2’ ట్రైలర్ విడుదల
ముత్తువేల్ పాండియన్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్ రిటర్న్.. మరింత భారీగా, మరింత వైల్డ్‌గా ‘జైలర్ 2’ యాక్షన్ స్పెక్టాకిల్!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ‘జైలర్ 2’ ట్రైలర్‌ విడుదలైంది. తెలుగులోనూ విడుదలైన ఈ ట్రైలర్‌ హై-వోల్టేజ్ యాక్షన్, రజనీకాంత్ స్టైల్, కామెడీ, యాటిట్యూడ్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తనదైన క్విర్కీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘జైలర్’ ప్రపంచాన్ని మరింత పెద్దదిగా, మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

‘జైలర్’లో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఐకానిక్ క్యారెక్టర్ ముత్తువేల్ పాండియన్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి తనదైన స్టైల్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించనున్నారు. సీక్వెల్‌లో మరింత పెద్ద సంఘర్షణ, భారీ స్థాయి సవాళ్లు, విస్తృతమైన ప్రపంచాన్ని ట్రైలర్‌ పరిచయం చేస్తోంది. అదే సమయంలో ‘జైలర్’ను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టిన హ్యూమర్, మ్యాడ్‌నెస్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా కొనసాగిస్తూ ‘జైలర్ 2’పై మరింత ఆసక్తిని పెంచుతోంది.

సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఎస్.జె. సూర్య, విద్యా బాలన్, శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, రమ్యకృష్ణ, యోగిబాబు, సూరజ్ వెంజారమూడు, మిర్నా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పవర్‌ఫుల్ యాక్షన్, వినోదం, గుర్తుండిపోయే పాత్రలతో ‘జైలర్ 2’ ఒక భారీ ఎంటర్‌టైనింగ్ యాక్షన్ స్పెక్టాకిల్‌గా రూపొందుతోంది.

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఆర్. నిర్మల్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ‘జైలర్ 2’ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ అన్‌మ్యాచ్డ్ స్క్రీన్ ప్రెజెన్స్, నెల్సన్ దిలీప్‌కుమార్ ప్రత్యేకమైన ఎంటర్‌టైన్‌మెంట్, ‘జైలర్’ యూనివర్స్‌ను మరింత విస్తరించిన విధానం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here