4 ఎపిసోడ్స్ డాక్యుమెంటరీ సిరీస్ గా వస్తున్న విజయ్ దేవరకొండ “రణబాలి” నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్
యూట్యూబ్ లో ఈ నెల 28వ తేదీన స్ట్రీమింగ్ కు వస్తున్న ఫస్ట్ ఎపిసోడ్ ‘ది ఫెమైన్ వి ఫర్ గాట్’
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. “రణబాలి” నెవర్ ఫర్ గెట్ ది ట్రూత్ పేరుతో 4 ఎపిసోడ్స్ డాక్యుమెంటరీ సిరీస్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. యూట్యూబ్ లో ఈ నెల 28వ తేదీన ఫస్ట్ ఎపిసోడ్ ‘ది ఫెమైన్ వి ఫర్ గాట్’ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ నెల 30న సెకండ్ ఎపిసోడ్ ‘ది హిస్టరీ వి ఫర్ గాట్’, అక్టోబర్ 2న మూడో ఎపిసోడ్ ‘ది మెన్ వి ఫర్ గాట్’ స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. నాలుగో ఎపిసోడ్ ‘ది లాస్ట్ లోడ్’ స్ట్రీమింగ్ డేట్ ను త్వరలో ప్రకటించనున్నారు.
చరిత్రకు రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి మనకు చెప్పింది, మరొకటి ఎవరికీ తెలియకుండా సమాధి చేయబడింది. మనకు తెలియకుండా చరిత్రలో కనుమరుగు చేసిన ఆ నిజాలను చెప్పబోతోంది 4 ఎపిసోడ్ల రణబాలి ట్రూత్ సిరీస్. రణబాలి ప్రపంచం నుంచి ఎక్స్ క్లూజివ్ బిహైండ్ ది సీన్స్ కంటెంట్ తో ఈ డాక్యుమెంటరీ సిరీస్ రాబోతోంది.



