నందమూరి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు చొరవతో ముగిసిన డాన్సర్స్ అసోసియేషన్ వివాదం

0
25
Nandamuri Balakrishna and Chiranjeevi’s Intervention Helps Resolve Dancers’ Association Dispute
Nandamuri Balakrishna and Chiranjeevi’s Intervention Helps Resolve Dancers’ Association Dispute

నందమూరి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు చొరవతో ముగిసిన డాన్సర్స్ అసోసియేషన్ వివాదం

గత కొన్ని రోజులగా డాన్సర్ అసోసియేషన్ వివాదం గురించి వింటూనే ఉన్నాము. కాగా నేడు ఈ వివాదం పై ఒక సుదీర్ఘ చర్చ జరిగింది. జానీ మాస్టర్ గారు, డాన్సర్స్ ప్రెసిడెంట్ సుమలత గారితో ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని గారు, డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి సాయి రాజేష్ గారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి చదలవాడ శ్రీనివాసరావు గారు, తుమ్మల ప్రసన్నకుమార్ గారు చర్చలు జరిపిన తర్వాత మీడియా వారితో మాట్లాడడం జరిగింది.

ఈ సందర్భంగా అనిల్ వల్లభనేని మాట్లాడుతూ… “డాన్సర్స్ అసోసియేషన్ లో ఇటీవల్ కొన్ని ఘటనలు జరిగాయి. ఈ ఘటనలపై మీడియాలో పలు చర్చిలు రావడం జరిగింది. ఆ చర్చలకు ముగింపు పలికే దిశగా ఫెడరేషన్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పెద్దల సమక్షంలో జానీ మాస్టర్, సుమలత గారితో చర్చించడం జరిగింది. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి, యూనియన్ అలాగే జానీ మాస్టర్. జానీ మాస్టర్ ఫెడరేషన్కు వచ్చి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ వివరణకు సంతృప్తి చెందడం జరిగింది.
ఆయన పై ఫెడరేషన్ తీసుకున్న శాశ్వత బహిష్కరణ ను వెనుకకు తీసుకుంటున్నాము. 26న డాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీలో రాజీనామాలు చేసిన వాళ్ళు Qఅందరూ కలసి కట్టుగా ముందుకు వెళ్తారు. ఆ తర్వాత ఇండస్ట్రీ ఎలా ముందుకు వెళ్లాలి అని సర్వసభ్య సమావేశంలో పాల్గొని తదుపరి చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన సెక్రటరీ పై సభ్యుల సమక్షంలో చర్యలు తీసుకుంటాము. ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు చొరవతీసుకుని పలు నిజాలుగా ఈ సమస్యను పరిష్కరించేందుకు తగ్గ ప్రయత్నాలు చేశారు. వారికి మా ఫెడరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.

జానీ మాస్టర్ మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఇప్పుడే పెద్దలు అందరితో మాట్లాడి చర్చించడం జరిగింది. 24 క్రాఫ్ట్లకు ఫెడరేషన్ కావాలి, అది దృష్టిలో పెట్టుకుని నేను వివరణ ఇవ్వడం జరిగింది. నా వివరణకు సంతృప్తి చెందడంతో ఈ సమస్య ఎక్కడితో ముగించిందని ఆశిస్తున్నాను. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్న ముందుకు వస్తారు. అలాగే ఈ సమస్యను కూడా ఆయన చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించారు” అన్నారు.

సుమలత గారు మాట్లాడుతూ… “గత కొన్ని రోజులుగా అనేక వివాదాలతో డాన్సర్లు ఇబ్బందులు పడ్డారు. పెద్దలు వచ్చి ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేశారు. అందరూ బావుండాలని వారు ఈ సమస్యను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లడం మాకు చాలా సంతోషకరం. కార్మికుల కష్టం వృధా పోకూడదు, వారికి రావలసినంత ఫలితం వారికి రావాలి. శ్రమ దోపిడి జరగకూడదు. దానికి పెద్దలందరూ సహకరించి ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు” అన్నారు.

నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… “ఒక ఇంటిలో చిన్న చిన్న గొడవలు కావడం సాధారణ విషయం. నిర్మాతల సొమ్మును యూనియన్ కు కట్టకుండా మాయం చేస్తున్న కొంతమంది కార్మికులను గుర్తించి చర్యలు తీసుకుంటాము. డాన్సర్స్ అసోసియేషన్ అందరూ కలసి కట్టుగా ముందుకు వెళ్తారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా చదలవాడ శ్రీనివాసరావు గారు ఎంతో కృషి చేశారు. అలాగే కార్మికుల కష్టం కచ్చితంగా కార్మికులకే చెందేలా చూస్తాము. బాలకృష్ణ గారు ప్రత్యేకించి ఈ సమస్య పరిష్కారం కోసం మాతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు” అన్నారు.

చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ… “ముందుగా నందమూరి బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే బాలకృష్ణ గారు కాకినాడ నుంచి కాల్ చేసి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వాతావరణం ఉండకూడదు అని సమస్యను పరిష్కరించమని చెప్పారు. డాన్సర్స్ ఇరువర్గాలు చాలా మంచి వారే, ఎంతో కష్టపడి పని చేస్తారు. సమస్య తెలిసిన వెంటనే అందరితో చర్చించి ఈ సమస్య పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాము. ఇక్కడ ఎవరి తప్పు లేదు, ఇంతటితో ఈ సమస్య పరిష్కారం అయ్యింది. అందరూ కలిసి కట్టుగా పని చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నిర్మాతలకు అందరూ అండగా నిలబడి ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను” అన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here