పహల్గాం ఉగ్ర దాడి పై FNCC తీవ్ర దిగ్భ్రాంతి

0
282
FNCC Condemns Pahalgam Terrorist Attack
FNCC Condemns Pahalgam Terrorist Attack

పహల్గాం ఉగ్ర దాడి పై FNCC తీవ్ర దిగ్భ్రాంతి

ఐక్యత.. సామరస్యం, రాజ్యాంగ విలువలపై దాడిని ఖండించిన సభ్యులు.
పహల్గామ్‌లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడి పై ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఉగ్రవాద దాడిలో అమరులైన వారికి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు..
ఈ సందర్భంగా నిర్మాత, FNCC ప్రెసిడెంట్ కె యస్ రామారావు మాట్లాడుతూ.. పహల్గాం లో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడి పట్ల మేం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఉగ్ర దాడిలో 26 మంది అమాయక పౌరులు మరణించారు, అనేక మంది గాయపడ్డారు. ఈ చర్యను తీవ్రంగా ప్రతిఘటించాలని అందుకు మోడీ ప్రభుత్వానికి FNCC సంఘీభావం తెలుపుతుందని తెలియజేసారు. అన్ని వేళలా మోడీ ప్రభుత్వం తీసుకునే చర్యలకు మా పూర్తి మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మల రంగరావు మాట్లాడుతూ.. భారత ప్రజలకు మేం సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాంతియుత పౌరులపై ఇటువంటి క్రూరమైన చర్యలకు సమాజంలో స్థానం లేదు.. ఈ క్రూర దాడులు ఐక్యత, శాంతి, సామరస్యం అనే రాజ్యాంగ విలువలపై చేసిన ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. ఈ దాడి కి కఠినమైన ప్రతిఘటన ఉండాలని మోడీ ప్రభుత్వాన్ని అభ్యర్దిస్తున్నాము. అందుకు మా పూర్తి సహకారం తెలియజేస్తున్నాము.. అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పరుచురి గోపాలకృష్ణ, నటుడు చిన్నా, బెనర్జీ, ఆది శేషగిరి రావు, కాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొని కొవ్వుత్తుల ప్రదర్శన చేసారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here