సూపర్‌స్టార్ మహేష్ – బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్ మధ్య స్నేహం గురించి తెలిసిందే. అప్పట్లో రామోజీ ఫిలింసిటీలో `దిల్వాలే` షూటింగ్ జరుగుతున్నప్పుడు .. ఆ పరిసరాల్లోనే `బ్రహ్మోత్సవం` షూటింగులో ఉన్న మహేష్ `దిల్వాలే` సెట్స్‌కి వెళ్లి షారూక్‌ని కలిసి వచ్చారు. ఓ అభిమానిగా గౌరవార్థకంగా నాడు మహేష్ అలా కలిశారు. నాటి అనుబంధాన్ని షారూక్ అంత తేలిగ్గా మర్చిపోలేదు.
ఇటీవలే `రయీస్` ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన షారూక్.. టాలీవుడ్‌తో తనకి ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ .. మరోసారి తాను హైదరాబాద్‌కి వస్తే డిన్నర్‌కి ఆహ్వానించాల్సిందిగా మహేష్‌ను కోరాడు. బాద్షా అంటే మహేష్‌కి అంతే అభిమానం.. కాబట్టి ఇకముందు ఈ ఇద్దరు సూపర్స్టార్లు హైదరాబాద్‌లో కలిసి డిన్నర్ చేస్తారన్నమాట!


