తమిళ నవల కుట్ర పరంపరై ఆద్యంతం ఉత్కంఠభరితం – దేవి ప్రసాద్

0
182

“కుట్ర పరంపరై”
రచన: వేల్ రామ్మూర్తి
_________________________________________
వందసంవత్సరాలక్రితం…. తరతరాలుగా దొంగతనాలే వంశపారంపర్య వృత్తిగా జీవించిన ఓ గ్రామస్థుల కధ.

దొంగతనాలు మానండి అంటే మీవృత్తులు మీరు చేసుకుంటున్నప్పుడు మావృత్తి మేము చేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నించే అమాయకుల కధ.

ఆపదలో వున్న అసహాయులను ఆదుకోవటానికి తమప్రాణాలను సైతం లెక్కచేయని మానవత్వమున్న మనుషుల కధ.

ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఎంతటివారి ప్రాణాలనైనా అగ్నికి ఆహుతి చేయగల రాతిగుండెలున్న మనుషుల కధ.

ప్రకృతి ప్రసాదించిన నీటిపై హక్కు ఏ ఒక్క వర్గానిదో వర్ణానిదో కాదని ఆనాటి ఆంక్షలను ధిక్కరించిన వీరుల కధ.

కొన్ని సన్నివేశాలలో “వేల్ రామ్మూర్తి” గారి చిత్రణ మన రాజమౌళి గారి ఉద్వేగభరిత సన్నివేశాలను చూస్తున్నట్టు పాఠకుడ్ని రోమాంచితం చేస్తుంది.

ఎవరైనా ఈ నవలను తెలుగులోకి అనువదిస్తే ఆనందం.
త్వరలో తమిళం లో సినిమాగా రూపొందబోతున్నట్లు సమాచారం.

సినిమా వాల్ పోస్టర్స్ లో ఒక్కో తమిళ అక్షరాన్ని నాతో పట్టిపట్టి చదివించి నాకు తమిళ భాషను నేర్పించిన మద్రాసు మహానగరానికీ ఈ పుస్తకాన్ని నాకిచ్చి చదివించిన మిత్రుడు K N Vijaya Kumarకి ధన్యవాదాలు.

_________________ దేవీప్రసాద్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here