వంశీ పైడిపల్లి,  దిల్ రాజు కాంబినేష‌న్‌ లో రూపొంద‌నున్న‌ తలపతి విజయ్ 66వ చిత్రంలో క‌థానాయిక‌గా రష్మిక మందన్న

0
305

తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న తలపతి విజయ్ ,జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి జాతీయ అవార్డు పొందిన‌ నిర్మాత దిల్ రాజు & శిరీష్ తమ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై  భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ చిత్రంలో విజయ్ సరసన కథానాయికగా నటించ‌నున్న‌ట్లు ర‌ష్మిక‌ పుట్టినరోజు సందర్భంగా మేక‌ర్స్ ప్రకటించారు. సక్సెస్ ఫుల్ కలయికలో రాబోతున్న ఈ చిత్రం అంతే సక్సెస్ ఫుల్  గా తీర్చిదిద్ద‌బోతున్నారు. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రంలో  విజయ్‌ని మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయడానికి వంశీ పైడిపల్లి పవర్‌ ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు.

ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here