ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్ ఈవెంట్

0
322

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్తం శెట్టి మీడియా పతాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ నిర్మిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం పుష్ప‌. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, హిందీ, త‌మిళ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆగ‌స్ట్ 13న విడుద‌ల‌వుతుంది. సినిమాలో బ‌న్నీ పుష్ప‌రాజ్ అనే పాత్ర‌ను పోషిస్తున్నాడు. ఈ పాత్ర‌కు సంబందించిన టీజ‌ర్‌ను ఇంట్ర‌డ్యూసింగ్ పుష్ప‌రాజ్ పేరుతో విడుద‌ల చేశారు. టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. బ‌న్నీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌లైన టీజ‌ర్ విడుద‌లైన ఇర‌వై నాలుగు గంట‌ల్లో తగ్తేదే ..లే అంటూ ఇర‌వై మూడు మిలియ‌న్ వ్యూస్‌తో సోష‌ల్ మీడియాలో సెన్సేష‌ల్ క్రియేట్ చేస్తోంది. అభిమానుల స‌మ‌క్షంలో బ‌ర్త్‌డేను సెల‌బ్రేట్ చేసుకున్న బ‌న్నీ కేక్ క‌ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా…

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘అభిమానుల సమక్షంలో టీజర్‌ను విడుద‌ల చేయ‌డ‌మేకాదు.. వారితో క‌లిసి పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఇంత‌క‌న్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుందో చెప్పండి. ప్ర‌తి అభిమానికి థాంక్స్‌. నిజంగా అదృష్ట‌వంతుడ్ని. నా జీవితాన్ని అభిమానుల‌కు అంకితం చేసుకుంటున్నాను. నాకు ఈ బ‌ర్త్‌డే చాలా స్పెష‌ల్‌. అంత స్పెష‌ల్ కావ‌డానికి రెండు కార‌ణాలున్నాయి. అందులో ముందుది టీజ‌ర్‌. పుష్ప.. త‌గ్గేదే లే. రెండో విష‌యం.. నా లైఫ్ టేకాఫ్ అయ్యిందే ఆర్య‌తో. సుకుమార్‌గారి వ‌ల్ల‌. ఆ సినిమా వ‌ల్ల నాకు స్టైలిష్ స్టార్ అనే పేరొచ్చింది. ఇక నా ఫ్యూచ‌రంతా, ఉండేలా కొత్త పేరు వ‌చ్చింది. నాకు ఆర్య ఇచ్చినందుకు, ఐకాన్ స్టార్ అనే కొత్త పేరు ఇచ్చినందుకు సుకుమార్‌గారికి థాంక్స్‌. సుకుమార్‌గారు నాకేమిచ్చిన స్పెష‌ల్‌గా, ఎప్పుడూ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఈసారి కూడా గుర్తుండిపోయే గిఫ్ట్‌ను అందించారు. పుష్ప సినిమాలో హీరో ఊత‌ప‌దం త‌గ్గేదే లే. కానీ నిజ జీవితంలోనూ నాకు నేనుగా ఈ మాట చెప్పుకుంటూ ఉంటాను. అంద‌రిలాగానే, నాకు భ‌యాలుంటాయి. భ‌య‌ప‌డ్డ ప్ర‌తిసారీ ధైర్యం చేసి ముంద‌డుగు వేసెయ్‌, ప‌డిపోయిన ప‌ర్లేదు, ఫెయిల్ అయినా ప‌ర్లేదు..త‌గ్గేదే లే అని అనుకుంటాను. అలా అనుకున్నాను కాబ‌ట్టి, ఇంత వ‌ర‌కు రాగ‌లిగాను. తెలుగు సినిమా ఈరోజు ఇంత పెద్ద మార్కెట్ క్రియేట్ అయ్యిందంటే తెలుగు ప్రేక్ష‌కుల‌తో పాటు ఇత‌ర భాష‌లకు చెందిన, ఇత‌ర దేశాల్లోని ప్రేక్ష‌కాభిమానులే కార‌ణం. రానున్న పాతికేళ్ల‌లో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ ఇండ‌స్ట్రీగా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. దానికి ప్రేక్ష‌కాభిమానులే కార‌ణం. నిర్మాత‌లు న‌వీన్‌, ర‌విగారు, స‌తీష్‌గారు, ప్ర‌వీణ్‌గారికి థాంక్స్‌. టెక్నీషియ‌న్స్‌కు, దేవిశ్రీ ప్ర‌సాద్‌కు థాంక్స్‌. త‌ను ఇచ్చే ఆడియో వింటే త‌గ్గేదే లే అని అనుకుంటారు’’ అన్నారు.

బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ మాట్లాడుతూ – ‘‘బ‌న్నీకి స్టైలిష్ స్టార్ అని ఎప్పుడు పేరొచ్చిందో తెలియ‌దు. కానీ.. పుష్ప సినిమాలో బ‌న్నీ అమేజింగ్ పెర్ఫామెన్స్ అందించ‌బోతున్నామ‌ని కాన్ఫిడెంట్‌గా చెప్ప‌గ‌ల‌ను. అది చూసిన త‌ర్వాత స్టైలిష్ అనే ప‌దంలో పెర్ఫామెన్స్ లేద‌నిపించింది. త‌ను చేసే పెర్ఫామెన్స్‌కు స్టైలిష్‌కు స‌బంధం లేద‌నిపించింది. బ‌న్నీ చాలా యూనిక్‌. త‌ను ఎంచుకునే ప్ర‌తి సినిమా యూనిక్‌. త‌ను వేసుకునే డ్రెస్సింగ్ నుంచి అన్నింట్లో యూనిక్‌గా ఉంటాడు. త‌ను ఇక‌పై స్టైలిష్ స్టార్ కాడు.. బ‌న్నీ ఇక‌పై ఐకాన్ స్టార్‌. ఇంత‌కు ముందు అంద‌రూ బ‌న్నీని ఆర్య అని పిలిచేవారు. అయితే ఈ సినిమా త‌ర్వాత అంద‌రూ త‌న‌ని ఐకాన్ స్టార్ అని పిల‌వాలి లేదా.. పుష్ప అని పిల‌వాలి. మా నిర్మాత‌ల‌కు ఈ సంద‌ర్భంగా థాంక్స్‌. కావాల్సినంత స‌పోర్ట్‌ను అందించారు. మా సినిమాటోగ్రాఫ‌ర్ కూబా, ఏ దేశం నుంచి వ‌చ్చాడో తెలియ‌దు కానీ.. అమేజింగ్ టెక్నీషియ‌న్‌. నా భాష త‌న‌కు అర్థం కాదు, త‌న భాష నాకు అర్థం కాదు. కానీ.. సినిమా మాత్రం ఇద్ద‌రికీ అర్థ‌మ‌వుతుంది. నా సినిమా బ్ర‌హ్మ‌లు రామ‌కృష్ణ, మోనిక‌, నా మూడ్ స్వింగ్స్‌ను భ‌రిస్తున్న దీపాళి, ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్ అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దారు. పీట‌ర్ హెయిన్స్‌, శేఖ‌ర్ మాస్ట‌ర్‌, జానీ మాస్ట‌ర్ స‌హా పేరు పేరున ఈ సినిమా కోసం క‌ష్ట‌ప‌డుతున్న అందరికీ థాంక్స్‌’’ అన్నారు.
నిర్మాత యలమంచిలి రవిశంకర్‌ మాట్లాడుతూ ‘‘ఒక సినిమా విజయవంతం కావాలంటే కథ ఎంత ముఖ్యమో… అందులోని మాటలు, సంగీతం, కెమెరా, పోరాటాలు భావోద్వేగాలు అంత ముఖ్యం. అవన్నీ కలగలిపిన సినిమానే ‘పుష్ప’’’ అన్నారు.

అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘‘టీజ‌ర్ చూస్తుంటే ఒక ఫ్యాన్‌గా చాలా సూపర్‌గా అనిపించింది. ఈ స్టేజీపైకి వచ్చి సినిమా గురించి మాట్లాడాలంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా మాత్రమే అర్హత ఉంది. కానీ ఇంతమంది గొప్ప వాళ్ల ముందు మాట్లాడటానికి ఇంకా కొన్ని రోజులు టైమ్ పడుతుంది. అది సాధించిన రోజు మా అన్నగురించి నేనే మాట్లాడతాను’’ అని తెలిపారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మందన్న, ఫ‌హాద్ ఫాజిల్ త‌దితరులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి కెమెరామెన్: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్, మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్, ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్, స్టైలింగ్ : దీపాలి నూర్, ఆర్ట్ డైరెక్టర్: ఎస్.రామకృష్ణ , మౌనిక, సి.ఈ. ఓ: చెర్రీ, లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కె.వి.వి, ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై, సహ నిర్మాత – ముత్తంశెట్టి మీడియా, రచ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : సుకుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here