ఘ‌నంగా ప్రారంభమైన డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌య కృష్ణ‌ నరేష్ ల `అందరూ బాగుండాలి అందులో నేనుండాలి`

0
518

కొత్త టాలెంట్‌ని ఎంక‌రేజ్ చేయ‌డానికి స్టార్ క‌మెడియ‌న్ అలీ ఇటీవ‌ల అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ని స్థాపించిన విష‌యం తెలిసిందే..తాజాగా అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్నచిత్రం `అందరూబాగుండాలి అందులో నేనుండాలి. `రామ్‌లీలా` ఫేమ్ శ్రీపురం కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభమైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్వీకృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి క్లాప్‌నివ్వ‌గా ఎస్. గోపాల్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొద‌టి స‌న్నివేశానికి ద‌ర్శ‌కులు బోయపాటి శ్రీను, బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజ‌ర‌య్యారు. జీవిత రాజ‌శేఖ‌ర్, త‌నికెళ్ల భ‌ర‌ణి, హేమ‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా

తెలంగాణ సినిమాటోగ్ర‌ఫి శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మాట్లాడుతూ – “అలీతో నాకు ప్ర‌త్యేక‌ అనుభందం ఉంది. ఆయ‌న నిర్మాణంలో రూపొందుతోన్న అందులోనేనుండాలి చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో అలీ, నరేష్ కలిసి నటిస్తుండడం మంచి ప‌రిణామం. భవిషత్తులో వీరిద్ద‌రూ మరిన్ని మంచి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను“ అన్నారు.

అలీ మాట్లాడుతూ…దర్శకుడు కిరణ్ నేను చెన్నై లో రూమ్ మేట్స్, మలయాళం లో జరిగిన ఒక వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నాము. మల‌యాళం బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ వికృతి సినిమాకు రీమేక్ ఇది. ఈ కథ నచ్చి వెంటనే నరేష్ గారికి ఈ సినిమా చూడమని చెప్పాను. ఆయనకు ఈ మూవీ బాగా నచ్చి ఈ సినిమా చేస్తున్నాను అన్నారు. పవిత్ర లోకేష్ ఈ సినిమాలో మంచి పాత్రలో నటిస్తున్నారు. సాయి కుమార్ బ్రదర్ రవిశంకర్ ఈ సినిమాలో ఒక పాత్ర చేస్తున్నారు. రాకేష్ మ్యూజిక్ భాస్కరభట్ల సాహిత్యం ఇలా అందరూ పెద్ద టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు.

నరేష్ మాట్లాడుతూ…అలీ సినిమా చేస్తున్నాడంటే సినిమాకు ఒక బ్రాండ్ వస్తుంది. తను నేను కలసి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాము. అందరూబాగుండాలి అందులోనేనుండాలి మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా అలీ ఈ సినిమాను నిర్మిస్తూ నటిస్తున్నాడు. దర్శకుడు శ్రీపురం కిరణ్ మంచి మార్పులు చేసి బెస్ట్ స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడు. ఒక మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

డైరెక్టర్ శ్రీపురం కిరణ్ మాట్లాడుతూ….అలీ గారు స్థాపించిన అలీవుడ్ బ్యానర్ లో నేను డైరెక్ట్ చెయ్యడం సంతోషంగా ఉంది. నరేష్ గారు మా సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. ఈరోజు నుండి చిత్ర షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.

హీరోయిన్ మౌర్యానీ మాట్లాడుతూ..అలీగారంటే అంద‌రికీ అభిమాన‌మే, అలానే ఇందులో మ‌రో కీల‌క పాత్ర చేస్తున్న న‌రేశ్ గారితో క‌లిసి న‌టిస్తుండ‌టం చాలా ఆనందంగా ఉంది. చాలా మంది ప్ర‌తిభావంత‌మైన‌, ఎక్స్ పీరియ‌న్స్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్ల‌తో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం రావ‌డం నా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ సినిమా క‌చ్ఛింత‌గా ప్రేక్ష‌కుల్ని ఆక్ట‌ట్టుకుంటుంద‌ని ఆశిస్తున్నాను.

తారాగాణం

డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌యకృష్ణ న‌రేశ్, మౌర్యానీ, ప‌విత్ర లోకేశ్ త‌దిత‌రులు

టెక్నీషియ‌న్లు

బ్యాన‌ర్ – అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత‌లు – అలీబాబ‌, కొనతాల మోహ‌న‌కుమార్
డిఓపి – ఎస్. ముర‌ళి మోహ‌న్ రెడ్డి
సంగీతం – రాకేశ్ ప‌ళిడ‌మ్
పాటలు – భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్
ఎడిట‌ర్ – సెల్వ‌కుమార్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ – ఇర్ఫాన్
ఆర్ట్ డైరెక్ట‌ర్ – కేవి ర‌మ‌ణ‌
మేక‌ప్ చీఫ్ – గంగాధ‌ర్
ర‌చన, ద‌ర్శ‌క‌త్వం – శ్రీపురం కిర‌ణ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here