నటసింహ బాలకృష్ణ,బోయపాటి శ్రీను మ్యాసీవ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ మూవీలో హీరోయిన్‌గా స‌య్యేషా సైగ‌ల్‌

1
487

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయ‌పాటి‌ శ్రీ‌ను కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ మూవీ రూపొందుతోన్నవిష‌యం తెలిసిందే..ఈ మూవీలో హీరోయిన్‌గా స‌య్యేషా సైగ‌ల్ ఎంపికైన‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌. ద్వారక క్రియేషన్స్ ప‌తాకంపై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్న ఈ మూవీ లాక్‌డౌన్‌కి ముందే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుంది. లాక్‌డౌన్ వ‌ల్ల వాయిదా ప‌డ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌ల పు‌నః ప్రారంభ‌మైంది. ప్ర‌భుత్వ నిభంద‌నల‌ ప్రకారం అన్నిజాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్ కొన‌సాగిస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నఈ చిత్రం నుండి ఇప్ప‌టికే బాలయ్య బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన `బిబి3 ఫస్ట్‌రోర్`‌ సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. బాలయ్యబోయపాటి మ్యాసీవ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌లో వస్తున్న ఈ మూవీ, ప్రేక్షకులు, అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నరేంజ్‌లో మోస్ట్ పవర్ఫుల్ గా మంచి కథా బలంతో పాటు గ్రాండియర్‌గా తెరకెక్కుతోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ, స‌య్యేషా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌, సినిమాటోగ్రఫీ: రాంప్రసాద్‌, మాట‌లు: ఎం.ర‌త్నం,ఎడిట‌ర్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర రావు – త‌మ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్ మాస్టర్స్: రామ్ – లక్ష్మణ్, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here