ఎన్నో ఏళ్ల పాటు ఆంగ్లేయుల బానిస సంకెళ్లలో నలిగిపోయిన భారతావనిని వారి కబంధ హస్తాల నుండి విడిపించి.. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అశువులు బాసిన ఎందరో సమరయోధుల త్యాగ దీక్షా దక్షతలను స్మరించుకుంటూ… స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ. హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో కొద్ది సేపటి క్రితం నందమూరి బాలకృష్ణ జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అందరు కరోనా బారిన పడకుండా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.




