ట్విట్టర్ ట్రెండ్స్ లో పలు సంచలన రికార్డ్స్ నమోదు చేసిన సూపర్ స్టార్ మహేష్ ‘సర్కారు వారి పాట’…!!

0
683
Superstar Mahesh's Sarkaru Vaari Paata Records In 24 Hours

సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ లుక్ పోస్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారి జన్మదినం సందర్భంగా నిన్న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా ‘సర్కారు వారి పాట’ పోస్టర్ కు ప్రేక్షకులు, అభిమానుల నుండి విశేషమైన స్పందన లభించడం తోపాటు సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ట్రెండ్స్ లో పలు సంచలన రికార్డ్స్ నమోదు చేయడం జరిగింది.

నిన్నటి నుండి ‘సర్కారు వారి పాట‘ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ట్విట్టర్ లో విశేషమైన స్పందన వచ్చి తెగ ట్రెండ్ అవుతూ 24 గంటల్లో అత్యధిక మంది లైక్ చేసిన, రీట్వీట్ చేసిన, అలానే ట్వీట్ చేసిన టైటిల్ ట్యాగ్ గా గత ట్విట్టర్ ట్రెండ్స్ రికార్డులను బద్దలుకొట్టి సెన్సేషనల్ రికార్డ్ సృష్టించింది. కాగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ లాక్ డౌన్ అనంతరం ప్రారంభిస్తాం అని నిన్న ఇన్స్టాగ్రామ్ చాట్ సెషన్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తెలిపారు……!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here