హీరోయిన్ “ప్రీతి అశ్రాని ” ప్రధాన పాత్రలో “A” !!!

0
1304
Heroine Preethi Asrani as main lead A Movie

అవంతిక ప్రొడక్షన్స్ ‘A” (AD-INFINITUM) చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మళ్ళీ రావా చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రీతి అశ్రాని ప్రెజర్ కుక్కర్ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రీతి అశ్రాని ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అలాగే నితిన్ ప్రసన్న ; బేబీదీవెన(జబర్ధస్త్ ఫేమ్); స్నేహాల్ కమత్ ; రంగాదామ్, కృష్ణ వేణి ఈ చిత్రంలో ముఖ్యపాత్రల్లో నటించారు.

ఇదొక మెడికల్ త్రిల్లర్ , 1977 – 2019 మధ్య ఈ సినిమా కథాంశం ఉండబోతుంది. హాలీవుడ్ లో కూడా రానటువంటి ఒక విభిన్నమైన కథ తో “A” (AD-INFINITUM)“ చిత్రాన్ని తెరకెక్కించబడింది. ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ ఫిలిం స్కూల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారు కావటం విశేషం. థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం క్రొత్త అనుభూతి ని మరియూ సంతృప్తిని ఇవ్వబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here