కరోనా సంక్షోభం వలన సినిమా షూటింగు లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులకు సహాయం అందించేందుకు ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ కు దర్శకుడు సంపత్ నంది 5 లక్షల రూపాయల విరాళం అందించనున్నట్లు ప్రకటించారు.
ఇది ఎవరూ ఊహించని ఉపద్రవం అని, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో సహాయం గా అందించే ప్రతి రూపాయి ఎంతో కీలకం అని తన వంతుగా కరోనా క్రైసిస్ ఛారిటీ కు 5 లక్షల రూపాయల విరాళం గా అందిస్తున్నట్టు దర్శకుడు సంపత్ నంది తెలిపారు. ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ సంపత్ నంది కోరారు.



