సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఐదు సాంగ్స్, టీజర్ కు మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇక నేడు సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఎంతో గ్రాండ్ గా జరగనుండగా, మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్నారు. ఇకపోతే సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ ని నేడు రాత్రి 9 గం. 9 ని.లకు రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటనను రిలీజ్ చేసింది.
కాగా సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి, కీలక పాత్రలో రీఎంట్రీ ఇస్తున్నారు. కాగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది….!!


