మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కొత్త సినిమా తో రెడీ అయ్యారు. గత ఏడాది జులైలో విజేత అనే సినిమాతో పరిచయం అయిన కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఎలాంటి హడావుడి లేకుండా ఫస్ట్ స్టెప్ లో పాజిటివ్ టాక్ అందుకున్న కళ్యాణ్ రెండవ అడుగులో మరింత క్రేజ్ తెచ్చుకోవడానికి సిద్ధమయ్యాడు.
ప్రస్తుతం మెగా అల్లుడు “సూపర్ మచ్చి” అనే సినిమాలో నటిస్తున్నాడు. దీపావళి సందర్భంగా సినిమాకు సంబంధించిన టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. వర్షంలో తడుస్తూ చిన్నారులతో సరదాగా కనిపిస్తున్న కళ్యాణ్ సెకండ్ స్టెప్ కూడా సింపుల్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సూపర్ మచ్చి అనే క్యాచీ టైటిల్ మాస్ ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక కొత్త దర్శకుడు పులి వాసు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పలువురు సీనియర్ నటీనటులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ తెలియజేయనుంది.


