మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రతిరోజు పండగే అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక నేడు తన బర్త్ డే ని పురస్కరించుకుని ఒక ఓల్డేజ్ హోమ్ కి తనవంతుగా సాయం అందిస్తున్నట్లు సాయి తేజ్ ఒక వీడియో పోస్ట్ ద్వారా తెలిపారు. ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో సపోర్ట్ తో తన బర్త్ డే సందర్భంగా బ్లడ్ డొనేషన్స్, అలానే పలు సేవా కార్యమ్రాలు వంటివి చేస్తున్నారన్నారు.
అయితే నేడు తన ట్విట్టర్ అకౌంట్ ని ట్యాగ్ చేస్తూ, ఒక ఓల్డేజ్ హోమ్ వారు, తమ ఆశ్రమంలో కన్స్ట్రక్షన్ దశలో ఉన్న గోడను కట్టడానికి సాయం చేయమని కోరారన్నారు. అందుకోసం తన తరపున మెగా ఫ్యాన్స్ ని ఫ్లెక్సీలు వంటివి ఏర్పాటు చేయకుండా, తమకు వీలైనంత విరాళం ఇవ్వమని కోరగా, అందరూ కలిసి ఒక లక్ష రూపాయలు ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని, అలానే తాను ప్రత్యేకంగా ఒక ఏడాది వరకు ఆ ఓల్డేజ్ హోమ్ కి అవసరమైనవన్నీ స్వయంగా సమకూరుస్తానని మాట ఇచ్చినట్లు చెప్పారు తేజ్. కాగా తేజ్, తన బర్త్ డే నాడు ఎంతో దయార్ద్ర హృదయంతో చేసిన ఈ గొప్ప పనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి…..!!


