మాట తప్పని తలైవా.. నిర్మాత కోసం ఇల్లు

0
929

డబ్బు శాశ్వతం కాదని చెబుతారు. కానీ నిజజీవితంలో లేని వారికి సహాయపడితే అంతకంటే గొప్ప పని మరోటి లేదని చాలా తక్కువ మంది దాన్ని ఆచరిస్తారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ ముందుంటారు. తలైవా ఇచ్చిన మాట ప్రకారం తన మొదటి సినిమా నిర్మాతకు అండగా నిలిచాడు. అద్దె ఇంట్లో ఉంటున్నాడని తెలిసి ఇళ్ళు బహుమతిగా ఇచ్చారు.

తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలకు రచయితగా నిర్మాతగా వ్యవహరించిన కలైజ్ఞానం కోలుకోలేని నష్టాలను ఎదుర్కొన్నారు. అయితే గత నెల కలైజ్ఞానంకు సీనియర్ దర్శకుడు భారతీరాజా నేతృత్వంలో సన్మానసభ జరిగింది. చెన్నైలో జరిగిన ఈ సభకు సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కలైజ్ఞానం పరిస్థితి గురించి తెలుసుకున్న రజిని సభలోనే అందరి ముందు అండగా ఉంటానని మాట ఇచ్చారు.

వీలైనంత త్వరగా ఆయనకు సొంత ఇల్లు ఏర్పాటుచేస్తానని చెప్పారు. చెప్పనట్టుగానే రజినీకాంత్ కలైజ్ఞానంకు ఇల్లు కొన్నారు. నేడు ఆయన చేత గృహప్రవేశం చేయించిన రజిని మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు. రజినీకాంత్ మొదటిసినిమా భైరవి ని కలైజ్ఞానం నిర్మించారు. విలన్ గా నటిస్తుండగా హీరోగా చేస్తే బావుంటుందని ఆయన సలహా ద్వారా రజినీకాంత్ సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆ కృతజ్ఞతతో ఇప్పుడు నిర్మాతను ఆదుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here