సూపర్ స్టార్ మహేష్ బాబు lప్రముఖ మ్యాగజైన్ వోగ్ కవర్ పేజ్ పై సూపర్ స్టార్ స్టైలిష్ గా కనిపించారు. వైట్ అండ్ బ్లాక్ డ్రెస్ కాంబినేషన్ లో మహేష్ ఇచ్చిన స్టిల్ స్టైలిష్ గా ఉందని అభిమానులు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. ఈ స్టిల్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
ఇక మరో ఫ్రేమ్ లో నయనతార తో పాటు దుల్కర్ సల్మాన్ కూడా మహేష్ పక్కనే కనిపించడం ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. ఇక మహేష్ ప్రస్తుతం సరిలేరు నికెవ్వరు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను రామ బ్రహ్మం సుంకర – దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఆ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


