ఎమోషనల్ గా ధృవ్ విక్రమ్ ‘ఆదిత్య వర్మ’ సాంగ్

0
777

టాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి కథ తమిళ్ లో ఆదిత్య వర్మగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. విక్రమ్ తనయుడు ధృవ్ కథానాయకుడిగా నటించిన ఆ సినిమాలో బాణీత సందు కథానాయిక. నేడు ధృవ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా వీడియో సాంగ్ ని రిలీజ్ చేసింది. హీరోయిన్ పెళ్లి నాటి సీన్స్ లో హీరో పడే వేదనను ఒరిజినల్ గా కాకుండా కాస్త డిఫరెంట్ గా తెరకెక్కించినట్లు కనిపిస్తోంది.

ఈ వీడియో సాంగ్ లో ధృవ్ నటనతో ఆడియెన్స్ సరికొత్తగా ఎట్రాక్ట్ చేశాడనే చెప్పాలి. మొదటి సినిమా అయినప్పటికి సీనియర్ యాక్టర్ లా ఎమోషన్ ని మొత్తం కసిగా చూపించాడు. ఇక దర్శకుడు గిరి సయ్య కూడా ఒరిజినల్ కంటెంట్ మిస్ అవ్వకుండా కొంచెం డిఫరెంట్ స్టయిల్ లో తన మేకింగ్ ను ప్రజెంట్ చేశాడు. మొత్తానికి సాంగ్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు. మరి సినిమాతో ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి. E4 ఎంటర్టైన్మెంట్ లో ముకేష్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 4న రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here