సౌత్ సినిమాల్లో విదేశీ టెక్నీషియన్స్ వర్క్ చేయడం అనేది కామన్ గా మారిపోయింది. అయితే నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు పోలాండ్ కి చెందిన కెమెరామెన్ ని తేవడం ఎవరు ఊహించనిది. హాలీవుడ్ సైతం బెస్ట్ సినిమాటోగ్రఫీ లను అదే ప్రాంతం నుంచి ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ సినిమాటోగ్రఫీకి సంబంధించిన యూనివర్సిటీ లు కూడా చాలానే ఉన్నాయి.
ఇక గ్యాంగ్ లీడర్ సినిమాకి వర్క్ చేసిన పోలాండ్ సినిమాటోగ్రాఫర్ మిరోస్ల బ్రోజెక్ ఖుబా గురించి నాని ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. మొదటి ఈ సినిమా కోసం పిసి.శ్రీరామ్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆరు నెలల వరకు డస్ట్ తగలకుండా చూసుకోవాలని వైద్యులు సలహా ఇవ్వడంతో చిత్ర యూనిట్ చాలా అప్సెట్ అయ్యిందట. అయితే విక్రమ్ తన స్నేహితుడి ద్వారా ఖుబా తో ఫేస్ టూ ఫేస్ లైవ్ కాన్ఫరెన్స్ కాల్ లో ఇంటర్వ్యూ చేసి వెంటనే సెలెక్ట్ చేసుకున్నాడట. ఖుబా అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ కి వర్క్ చేసిన విధానం అతని ఫోటోగ్రఫీ గురించి కూడా దర్శకుడు తెలుసుకున్నట్లు చెప్పిన నాని మొదటి రెండు రోజుల్లోనే అతని సరికొత్త పనితనం నచ్చినట్లు చెప్పారు.


