రేపు గ్రాండ్ గా జరుగనున్న సూర్య ‘బందోబస్త్’ ప్రీ రిలీజ్ ఈవెంట్…!!

0
577

తమిళ స్టార్ సుర్య హీరోగా కెవి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కాప్పన్. తెలుగులో బందోబస్త్ పేరుతో అనువాదం అవుతున్న ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో మంచి వీక్షాధారణతో దూసుకుపోతున్నాయి. సూర్య సరసన సాయేషా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్, ఆర్య ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తుండగా, అభినందన్ రామానుజం ఫోటోగ్రఫీ ని అందిస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు సాయంత్రం హైదరాబాద్, మాదాపూర్ ప్రాంతంలోని ఐటిసి కోహెనూర్ లో ఎంతో వైభవంగా నిర్వహించనున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. సూర్య ఎన్ ఎస్ జి కమాండర్ గా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్ ప్రధానమంత్రిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here