నాచురల్ స్టార్ నాని హీరోగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ బ్యానర్ పై వెరైటీ చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్ లీడర్. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ మరియు సాంగ్స్ కు వీక్షకుల నుండి మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇకపోతే ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుకను ఈనెల 10 వ తేదీన, విశాఖపట్నంలో ఎంతో గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. నాని, పెన్సిల్ అనే డిఫరెంట్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుండగా, ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తీకేయ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!


