వాణి కపూర్ రిస్కీ డ్యాన్స్

0
680

బాలీవుడ్ ఆడియెన్స్ వార్ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో పాటలకు వస్తోన్న రెస్పాన్స్ ని బట్టి అర్ధమవుతోంది. విడుదలైన ట్రైలర్ అలాగే ‘ఘుంగ్రూ’ (తెలుగులో’గుండెల్లో తూట్లు పడే’) సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూవ్స్ తో దూసుకుపోతున్నాయి. మెయిన్ గా పాటలో వాని కపూర్ గ్లామర్ నార్త్ ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఆ పాట కోసం ఆమె చాలా రిస్క్ చేసినట్లు చిత్ర యూనిట్ ప్రమోషన్ లో తెలిపింది.

మెయిన్ గా పోల్ డ్యాన్స్ – వీల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆమె గాయాలకు గురైనట్లు దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తెలియజేశారు. దాదాపు మూడు నెలలు ఆమె ఆ సాంగ్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారని సినిమాలో పాట స్పెషల్ గా కనిపించాలని వాణి కొత్తగా పోల్ డ్యాన్స్ చేసినట్లు చెప్పారు. ఇక ఆ సాంగ్ ఇప్పటికే 26 మిలియన్ల వ్యూస్ ను అందుకుంది. హృతిక్ రోషన్ – టైగర్ ష్రాఫ్ కథానాయకులుగా నటించిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగులో అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here