టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ సొంతంగా కథలు రాసుకుంటూ మంచి విజయాలతో దూసుకుపోతున్నాడు. ఒక సినిమా విజయంలో కథానాయకుడి పాత్ర ఎంత అవసరమో అడివి శేష్ నిరూపించాడు. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి ప్రమోషన్స్ వరకు అన్ని విషయాల్లో స్పెషల్ కేర్ తీసుకొని వరుసగా క్షణం – గూఢచారి సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు.
ఇక ఇటీవల రిలీజైన ఎవరు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి లాభాలను అందిస్తోంది. ఫైనల్ గా అడివి శేష్ మునుపటి చిత్రం గూఢచారి కంటే ఎవరు సినిమా అత్యధిక వసూళ్లను అందుకొని శేష్ సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఎవరు నిలిచింది. నిర్మాతలు బయ్యర్లు కలెక్షన్స్ పరంగా హ్యాపీగా ఉన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎవరు సినిమా పివిపి బ్యానర్ నిర్మించగా వెంకట్ రామ్ జి దర్శకత్వం వహించారు.


