క్రిస్మస్ కానుకగా నితిన్ ‘భీష్మ’…!!

0
778

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాల్లో ఇటీవల వెంకీ కుడుముల దర్శకత్వంలో ప్రారంభమైన భీష్మ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. తొలి సినిమా ఛలో లో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వెంకీ, ఈ సినిమాలో నితిన్ ని ఒక విభన్నమైన పాత్రలో చూపించబోతున్నట్లు సమాచారం.

నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తుండగా, పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఆకట్టుకునే కథ, కథనాలతో, మంచి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను రాబోయే క్రిస్మస్ కానుకగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ ప్రకటన రిలీజ్ చేసింది. సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా పై  ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here