బాలీవుడ్ టాలెంటెడ్ హీరో అజయ్ దేవగన్ మరోసారి ఖరీదైన కారు కొనుగోలు చేసి వార్తల్లో నిలిచాడు. అజయ్ దేవగన్ కి కాస్ట్లీ కార్లంటే చాలా ఇష్టం.లగ్జరి గా ఉండే ఎలాంటి కారైనా సరే మార్కెట్ లోకి వస్తే అజయ్ దాన్ని టెస్ట్ చేయకుండా ఉండలేడు. ఇక ఈ సారి ఈ సీనియర్ హీరో 6.6కోట్ల ఖరీదైన కారును కొనుగోలు చేశాడు.
రోల్స్ రాయిస్ కి చెందిన కుల్లినన్ ఎస్‌యూవీని అజయ్ కొన్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్ ని దక్కించుకోవడం అంత సులువైన విషయం కాదు. ఇండియాలో ఈ మోడల్ కి సంబంధించిన కార్లు ఆరు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఇకపోతే అజయ్ దేవగన్ ఇటీవల దే దే ప్యార్ సినిమాతో బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నాడు. అలాగే టాలీవుడ్ బిగ్ మల్టీస్టారర్ RRR సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.


