రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గోల్డెన్ ఛాన్స్..!!

0
630

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ మరియు ప్రమోద్ నిర్మించిన భారీ బడ్జెట్ మూవీ సాహో ఈనెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెసిందే. ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా వస్తున్న ఈ భారీ ఏక్షన్ థ్రిల్లర్ రిలీజ్ దగ్గిర పడుతున్న కొద్దీ అంచనాలు పెంచుకుంటోంది.

నేడు ప్రకటించిన ఒక కాంటెస్ట్ ద్వారా రెబల్ స్టార్ ప్రభాస్ ను ఆయన ఫ్యాన్స్ కలిసేలా ఒక అద్భుత అవకాశాన్ని కల్పించింది సాహో మూవీ టీమ్. అయితే దానికోసం డార్లింగ్ ఫ్యాన్స్, ముందుగా సాహో పోస్టర్ తో ఒక సెల్ఫీ దిగి, అలానే ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ట్యాగ్ చేస్తూ తమ ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలి. ఆ విధంగా పోస్ట్ చేసిన వారి నుండి ఒకరిని స్వయంగా ప్రభాసే ఎంపిక చేసి, వారిని తనతో కలిసే అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. సాహో టీమ్ ఈ కాంటెస్ట్ ప్రకటించిన వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ అప్పుడే తమ సెల్ఫీ ఫొటోలతో  ఇంస్టాగ్రామ్ లో సందడి చేయడం మొదలెట్టేసారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here