ప్రభాస్ కు తమిళ్ మీడియా గ్రాండ్ వెల్కమ్

0
621

బాహుబలి అనంతరం అత్యంత భారీ బడ్జెట్ తో వస్తోన్న చిత్రం సాహో. ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చిత్ర యూనిట్ సినిమాపై హైప్ పెరిగేలా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఇక మొన్న టాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన సాహో యూనిట్ శుక్రవారం సాయంత్రం చెన్నై లో తమిళ్ మీడియాతో మాట్లాడారు.

అయితే ప్రభాస్ రాకతో చాలా మంది విజిల్స్ తో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అందరూ పాజిటివ్ గా సినిమాపై సందేహాలు అడుగుతూ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. ఇక ప్రభాస్ తో కూడా చెన్నై పాత్రికేయులు నవ్వుతూ పలకరించారు. ప్రెస్ మీట్ అనంతరం కొంతమంది ప్రముఖ జర్నలిస్ట్ లతో కలిసి ప్రభాస్ ఫొటోలకు పొజిచ్చారు. ఈ సినిమా కోసం తాము కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు చెబుతూ.. ప్రభాస్ కు తమిళనాడులో ఉన్న క్రేజ్ గురించి వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here