స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అత్యంత భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. ఇంకా టైటిల్ ని నిర్ణయించని ఈ సినిమాలో అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్, నవదీప్, రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీలక పాత్రలో నటిస్తున్న టబు షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఎన్నో వైవిధమైన పాత్రల్లో గొప్పగా నటించిన టబు ని త్రివిక్రమ్ ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారో అనే ఆసక్తి ఆడియన్స్ లో ఉంది.
అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు నమోదు చేయడంతో, ప్రస్తుతం హ్యాట్రిక్ సినిమా గా రూపొందుతున్న ఈ మూవీపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు, టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాకు పి ఎస్ వినోద్ ఫోటోగ్రఫీని అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా పని చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!


