‘లయన్ కింగ్’ సినిమాలోని సింబా పాత్రకు డబ్బింగ్ చెప్పడం మరిచిపోలేని అనుభూతినిచ్చింది : నాచురల్ స్టార్ నాని

0
612

నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక దానితోపాటు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో హీరో సుధీర్ బాబుతో కలిసి అయన వి అనే విభిన్న తరహా సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఎన్నో అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి టాక్ తో అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళుతోన్న ‘ది లయన్ కింగ్’ సినిమా తెలుగు వర్షన్లో సింబా పాత్రకు డబ్బింగ్ చెప్పిన నాని, నేడు ఆ సినిమాకి సంబందించిన వీడియో లో మాట్లాడుతూ తన అనుభవాలు పంచుకున్నారు.

తనకు లయన్ కింగ్ లో సింబా పాత్రకు డబ్బింగ్ చెప్పడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతినిచ్చిందని, మన తెలుగు సినిమాకు బాహుబలి ఎలాగో, హాలీవుడ్ లో ఒకప్పుడు 2డి యానిమేషన్ లో విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్న లయన్ కింగ్ అలాగని అయన అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా 3డి వర్షన్లో భారీ ఖర్చుతో అత్యద్భుతమైన గ్రాఫికల్ వండర్ గా రూపొందడం, అలానే ఆ సినిమాలో ముఖ్యమైన సింబా పాత్రకు తాను డబ్బింగ్ చెప్పడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. వాస్తవానికి తాను డబ్బింగ్ చెప్పడం వలన ది లయన్ కింగ్ సినిమా గురించి తాను మాట్లాడం లేదని, మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, ప్రస్తుతం ఎంత గొప్పగా కలెక్షన్లు రాబడుతుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కదా, కాబట్టి చిన్న, పెద్ద అని తేడాలేకుండా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా ఈ సినిమాని తప్పకుండా వీక్షించాలని కోరుకుంటున్నట్లు నాని తెలిపారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here