సాహో హీరో ప్రభాస్ హావా పాకిస్తాన్ లోను మొదలైంది. అక్కడి సామాన్య ప్రజలు మాత్రమే కాదు సెలెబ్రిటీలు కూడా ప్రభాస్ కు ఫిదా అవుతున్నారు. సాహో సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సాహో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆగష్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మూవీ రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలై వైరల్ అయిన సంగతి తెలిసందే.
తాజా విడుదలైన సైకో సయ్య సాంగ్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ పాటు భారతీయులతో పాటు పాకిస్తాన్ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. అక్కడ కూడా ఈ పాట మారు మోగుతుంది. ప్రభాస్ సాహో సాంగ్ పై పాక్ నటి మవ్రా హికెన్ ప్రశంసలు కురిపించడమే ఇందుకు కారణం. ప్రభాస్ సాంగ్ సైకో సయాన్ పేరును ట్యాగ్ చేస్తూ ఆమె ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ పాక్ తో పాటు ఇండియాలోనూ వైరల్ గా మారింది. దీన్ని బట్టి పాకిస్తాన్ లో ప్రభాస్ హావా ఎలా ఉందొ చెప్పచ్చు.
Prabhassss!!!!! 😍😍😍😍 🔥#PsychoSaiyaan
— MAWRA HOCANE (@MawraHocane) July 13, 2019


