ఆస్ట్రియాలోని టిరోల్ ప్రాంతంలో సాహో షూటింగ్ ఎక్స్పీరియెన్స్ అద్భుతం : రెబల్ స్టార్ ప్రభాస్

0
436

బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం సాహో. ఇక ఇటీవల యూట్యూబ్ లో విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ కు వీక్షకుల నుండి విశేషమైన స్పందన రావడంతో చిత్రంపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం ఆస్ట్రియా దేశంలోని టిరోల్ రీజియన్ లో జరుగుతోంది. అయితే అక్కడ తమ చిత్ర షూటింగ్ ఎక్స్పెరియన్స్ అద్భుతం అని యంగ్ రెబల్ స్టార్ కాసేపటి క్రితం తన ఇంస్టాగ్రామ్ లో అక్కడి షూటింగ్ స్పాట్ నుండి ఒక ఫోటోను పోస్ట్ చేయడం జరిగింది.

ఇక ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ తొలిసారి టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి, రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువి క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అతి త్వరలో ఆడియో విడుదల కార్యక్రమం జరుపుకోబోతున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here