దివంగత దిగ్గజ నటి మరియు తన అద్భుత దర్శకత్వ ప్రతిభతో 44 చిత్రాలు తెరకెక్కించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో తన పేరు నమోదుచేసుకున్న మహానటి శ్రీమతి విజయ నిర్మల గారు. ఇక కేవలం నటిగా దర్శకురాలిగా మాత్రమే కాక, ఆమె కొన్ని చిత్రాలను నిర్మించి, మంచి అభిరుచిగల నిర్మాతగా కూడా ఖ్యాతిని గడించారు. రెండురోజుల క్రితం ఆమె అకాల మరణం పొందిన విషయం తెలిసిందే.
అయితే ఆమె మృతికి సంతాపంగా నేడు టాలీవుడ్ ప్రఖ్యాత దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, విజయ నిర్మల గారి కుమారుడు నరేష్ గారిని అలానే సూపర్ స్టార్ కృష్ణ గారిని కలిసి తన సంతాపాన్ని ప్రకటించారు. అయితే త్రివిక్రమ్ గారు వచ్చిన సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అక్కడకు రావడం జరిగిందని, ఇక కాసేపు మహేష్, నరేష్, కృష్ణ గారితో కలిసి త్రివిక్రమ్ గారు మాట్లాడినట్లు కొద్దీసేపటి క్రితం ప్రకటన విడుదల చేయడం జరిగింది….!!


