మహేష్ ‘మహర్షి’ వేడుక.. మే 1న

0
539

అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగకు వేళయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడో డిసైడ్ అయ్యింది. మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్న ఈ సినిమాపై బోలెడు అంచనాలున్నాయి. వంశీ పైడిపల్లి దాదాపు 3 ఏళ్లుగా ఈ సినిమాపై వర్క్ చేస్తున్నారు. పకడ్బందీ కథా కథనంతోపాటు అల్లరి నరేష్, పూజాహెగ్డే ప్రధాన పాత్రధారులుగా సాగుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

స్టూడెంట్, బిజినెస్ మ్యాన్, రైతు నేపథ్యం ఇలా మూడు భిన్న పార్వ్యాలను తట్టిలేపుతున్న ఈ సినిమా కథ ఏంటనే దానిపై ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది.

మహేష్ బాబు తన 25వ సినిమా ‘మహర్షి’ని మే 9న రిలీజ్ చేస్తున్నారు. గత సంవత్సరం ఇదే మే9న వైజయంతీ మూవీస్ పతాకంపై ‘మహానటి’ విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మహర్షి నిర్మాతల్లో వైజయంతీ మూవీస్ కూడా ఒకటి. దీంతో అదే సెంటిమెంట్ తమకు కలిసి వస్తుందని డేట్ ఫిక్స్ చేశారు. పైగా సమ్మర్ హాలీడేస్ ఫీవర్ కూడా దీనికి తోడుగా ఉంది.

కాగా ప్రతిష్టాత్మక ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ వేడుకను మే 1న నిర్వహించేందుకు నిర్మాతలు డిసైడ్ అయ్యాడు. మే 1న హైదరాబాద్ నెక్లస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుక సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్టు ప్రకటన విడుదల చేశారు. దీంతో మహేష్ అభిమానులు ఈ వేడుక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here