సమ్మర్‌ కానుకగా ‘మే 1’న నిఖిల్‌ అర్జున్‌ సురవరం గ్రాండ్‌ రిలీజ్‌

0
643

‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’.. లాంటి విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్‌లు అందుకున్న యంగ్‌ హీరో నిఖిల్‌ రీసెంట్‌గా బి. మధు సమర్పణలో మూవీ డైనమిక్స్‌ ఎల్‌ఎల్‌పి, ఆరా సినిమాస్‌ ప్రై.లి. పతాకాలపై టి. సంతోష్‌ దర్శకత్వంలో రాజ్‌కుమార్‌ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్‌ నిర్మిస్తున్న చిత్రం ‘అర్జున్‌ సురవరం’. ఈసినిమాలో జర్నలిస్ట్‌ పాత్ర పోషిస్తున్న నిఖిల్‌ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్ర యూనిట్‌ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర సమర్పకుడు బి.మధు, నిర్మాత రాజ్‌కుమార్‌ ఆకెళ్ళ,హీరో నికిల్‌ పాల్గోన్నారు..

ఈ సందర్భంగా హీరో నిఖిల్‌ మాట్లాడుతూ – ” నా మొదటి సినిమా ‘హ్యపీడేస్‌’ నుండి నా 16వ సినిమా’అర్జున్‌ సురవరం’ వరకూ మీడియా నన్ను ఒక బ్రదర్‌లా సపోర్ట్‌ చేస్తూ వస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు. మీడియా గురించి సినిమా తీయడం నా రెస్పాన్సిబిలిటీగా ఫీల్‌ అవుతున్నాను. నేను జర్నలిస్ట్‌ పాత్ర పోషించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో ఎప్పటికైనా జెన్యూన్‌ రిపోర్టర్‌ అవ్వాలనేదే నా ధ్యేయం దాని కోసమే కృషి చేస్తుంటాను. ఇప్పటి వరకూ నేను నటించని జోనర్‌. ఈ రోజుల్లో మీడియా రంగం మీద సినిమా తీయడం అంటే ‘కత్తి మీద సాము’ అని చెప్పాలి. పవర్‌ ఫుల్‌ ఫ్లాట్‌ ఫామ్స్‌లో ఒకటైన మీడియాను పాజిటీవ్‌గా చూపిస్తూ దాని లోని అన్ని కోణాలు చూపించడం జరిగింది. నా కెరీర్‌లో మోస్ట్‌ రెస్పాన్సిబుల్‌గా ఫీల్‌ అయ్యి నటించాను.ఓ ప్రభుత్వం నిలబడాలన్నా.. కూలిపోవాలన్నా.. యుద్ధం మొదలు కావాలన్నా.. ఆగిపోవాలన్నా.. మీడియానే కీ రోల్‌ పోషిస్తుంది. మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఎలిమెంట్స్‌ ఒకటైన మీడియాను రెప్రజెంట్‌ చేయడం గర్వంగా ఉంది. ఈ సినిమా ‘మే’ డే కానుకగా ‘మే 1’న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం. నా గత సినిమాలు పోస్ట్‌పోన్‌ అయిన ప్రతీసారి విజయం సాధించాయి. అదే విదంగా ఈ సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది. ప్రజలంతా ఎలక్షన్స్‌ మూడ్‌లోనే ఉన్నారు. చాలా కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. వాటన్నింటికీ దూరంగా మా సినిమాను మే 1న విడుదల చేయడానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌ నిర్ణయించుకున్నారు. ఏషియన్‌ సునీల్‌గారు పిల్లర్‌లా మా సినిమాకు అండగా నిలబడ్డారు. ఆయన నైజాంలో ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నారు. మా సినిమా ఓవర్‌సిస్‌లో దాదాపు 160 థియేటర్లలో విడుదలకాబోతుంది. మీ అందరి సపోర్ట్‌ ఉండడం వల్లనే మా టీమ్‌ అందరం ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. పూర్తి 2-20 నిమిషాల సినిమా లాక్‌ అయ్యి ఉంది. ఈ సినిమాలో 635 గ్రాఫిక్‌ షాట్స్‌ ఉన్నాయి. నేను ఇంతవరకూ ఇన్ని గ్రాఫిక్‌ షాట్స్‌ ఉన్న సినిమా చేయలేదు. కంప్లీట్‌ ఫ్యామిలీతో పాటు అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించే చిత్రమవుతుంది. ‘ఠాగూర్‌’ సినిమాలో మధు గారు ఎంత మంచి పాయంట్‌ అయితే చూపించారో.. మళ్ళీ ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్‌ పాయంట్‌ని చాలా క్రొత్తగా చెప్పడం జరిగింది. ఆయన బేనర్‌లో ఆయన స్ట్రేచర్‌కి తగిన సినిమా అవుతుంది అని నమ్మకం ఉంది. ఈ సినిమా ‘మే’ డే కానుకగా ‘మే 1’న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం” అన్నారు.

చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజ్‌కుమార్‌ ఆకెళ్ల మాట్లాడుతూ – ” నిఖిల్‌ ఎక్స్‌ట్రార్డినరీ ఫ్యాషనేట్‌ యాక్టర్‌ అని మన అందిరికీ తెలుసు. ఎప్పుడూ ఆడియన్స్‌కి మంచి సినిమా అందివ్వాలనే తాపత్రయం పడుతూ ఉంటాడు. ఇప్పుడు రిలీజ్‌ డేట్‌ మీద క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం అందరూ ఎలక్షన్స్‌ మూడ్‌లో ఉన్నారు. అందుకే డిస్ట్రీబ్యూటర్స్‌ సలహా మేరకు ఈ సినిమాను మే1 న విడుదల చేస్తున్నాం. ఈ సినిమాకు ఇదే అప్రాప్రియోట్‌ డేట్‌. ఈ సినిమా ఒక మంచి సబ్జెక్ట్‌. ఈ సినిమాలో రెండు రెలవెంట్‌ ఇష్యూస్‌ ఉన్నాయి 1. మీడియా 2. స్టూడెంట్స్‌. ఇంత మంచి సినిమాలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది” అన్నారు.

నిఖిల్‌ సరసన లావణ్య త్రిపాఠి, వెన్నెలకిషోర్‌, పోసాని, తరుణ్‌ అరోరా, రాజా రవీంద్ర, నాగినీడు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సూర్య, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, సంగీతం: శామ్‌ సిఎస్‌, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: రాగారెడ్డి, సమర్పణ: బి. మధు, నిర్మాతలు: రాజ్‌కుమార్‌ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి. సంతోష్‌.

http://industryhit.com/t/2019/03/arjun-suravaram-release-date-press-meet-pics/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here