చీకటి గదిలో చితకొట్టుడు సినిమాను ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌ – దర్శకుడు సంతోష్‌ పి.జయకుమార్‌

0
458

ఆదిత్‌ అరుణ్‌, నిక్కీ తంబోలి, భాగ్యశ్రీ మోటే, మిర్చి హేమంత్‌, తాగుబోతు రమేష్‌ ప్రధానపాత్రల్లో సంతోష్‌ పి. జయకుమార్‌ దర్శకత్వంలో అడల్ట్‌ కామిడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమా ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’.. ఈ చిత్రం మార్చి 21విడుదలై మంచి టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన సక్సెస్‌ మీట్‌లో…

దర్శకుడు సంతోష్‌ పి.జయకుమార్‌ మాట్లాడుతూ – ”సినిమా విడుదలై రెండు రోజులవుతుంది. చాలా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. చిన్న బడ్జెట్‌లో చేసిన ఈ సినిమా ప్రజలకు రీచ్‌ అయ్యేలా చేసిన మీడియాకు ఈ సందర్భంగా థాంక్స్‌. సినిమా 2.5 కోట్ల రూపాయలను వసూలు చేసిందని తెలిసి ఆనందపడుతున్నాం. థియేటర్‌లో సినిమా చూసేవాళ్లు విపరీతంగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఓ డైరెక్టర్‌గా నాకు ఆనందంగా ఉంది. సపోర్ట్‌ చేసిన ఎంటైర్‌ యూనిట్‌కు థాంక్స్‌. సినిమాను ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌” అన్నారు.

హీరోయిన్‌ నిక్కీ తంబోలి మాట్లాడుతూ – ”దర్శక నిర్మాతలు సహా ఎంటైర్‌ యూనిట్‌కు థాంక్స్‌. సినిమా చాలా గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యింది. అందరికీ థాంక్స్‌” అన్నారు.

హీరో ఆదిత్‌ అరుణ్‌ మాట్లాడుతూ – ”ఈ సినిమా రిలీజ్‌ అయ్యేటప్పుడు చాలా మంది చాలా మాట్లాడారు. ఇలాంటి సినిమాలు అవసరమా? అని అన్నారు. సినిమా చూడకుండానే చాలా రకాలుగా మాట్లాడారు. అలాంటి వారందరికీ మా సినిమా మంచి జవాబు చెప్పింది. మా సినిమాను చూసి ఎంజాయ్‌ చేసిన ప్రేక్షకుడికి థాంక్స్‌. బి, సి సినిమా.. మల్టీప్లెక్స్‌లో వర్క్‌ అవుట్‌ కాదని అన్నారు. నా నిర్మాత, దర్శకుడికి థాంక్స్‌. ఆనందంతో మాటలు రావడం లేదు. ష్యూర్‌ షాట్‌గా ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుందని చెప్పాను. నా మాట నిలబెట్టిన ప్రేక్షకులకు థాంక్స్‌” అన్నారు.

http://industryhit.com/t/2019/03/nikki-tamboli-pics-3/

 

http://industryhit.com/t/2019/03/chikati-gadilo-chitakkotudu-success-meet-pics/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here