డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’

0
3
Allari Naresh Alocohol Release Date
Allari Naresh Alocohol Release Date

డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’

విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో అల్లరి నరేష్ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఆల్కహాల్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మెహర్ తేజ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మానవ ప్రవర్తనలోని విభిన్న కోణాలు, నేర ప్రవృత్తి, మనిషి తీసుకునే నిర్ణయాలు వాటి పర్యవసానాల నేపథ్యంలో ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా అల్లరి నరేష్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా స్టైలిష్, సరికొత్త లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.

ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన రుహానీ శర్మ నటిస్తుండగా, నిహారిక ఎన్‌ఎం, సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, రఘుబాబు, వెంకటేష్ కాకుమాను, కిరీటి దమరాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకు ప్రతిభావంతమైన సాంకేతిక బృందం పనిచేస్తోంది. ఘిబ్రాన్ సంగీతాన్ని అందిస్తుండగా, చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తున్నారు. జిజు సన్నీ సినిమాటోగ్రఫీ, నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విశాల్ అబాని ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

ఆసక్తికరమైన కథాంశం, అల్లరి నరేష్ సరికొత్త అవతారం, ప్రతిభావంతమైన నటీనటులు, సాంకేతిక నిపుణుల కలయికలో రూపొందుతున్న ‘ఆల్కహాల్’ డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here