బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా ‘ఫన్’ పూజ కార్యక్రమాలతో ప్రారంభం

0
6
Bigg Boss Winner Kalyan Padala Turns Hero With FUN
Bigg Boss Winner Kalyan Padala Turns Hero With FUN

బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా వింధ్యా ఫిల్మ్ ప్రొడక్షన్స్ నూతన చిత్రం ‘ఫన్’ పూజ కార్యక్రమాలతో ప్రారంభం.. నవంబర్ 12 నుంచి రెగ్యులర్ షూటింగ్

వింధ్యా ఫిల్మ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సంతోషి రెడ్డి నిర్మాణంలో హేమంత్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ హారర్ కామెడీ చిత్రం “ఫన్” నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 12 నుంచి ప్రారంభం కానుంది.
ఈ సినిమాని వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. కళ్యాణ్ పడాల హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాహితి, అజయ్ ఘోష్, రవి శివ తేజ, వి.యశోర, సోనియా నాయుడు, జె.డి.వి ప్రసాద్, బేబీ జస్విత, మాస్టర్ హనీష్ ముఖ్య పాత్రలను పోషించానున్నారు.

ఈ సినిమాకి సంగీతం రామ్ గోపాల్ అందించనున్నారు. జి.ఎల్ బాబు కెమెరామెన్‌గా, క్రాంతి (ఆర్.కె.) ఎడిటర్‌గా పని చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్‌లను అందించేలా మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు.

నటీనటులు : కళ్యాణ్ పడాల, సాహితి, అజయ్ ఘోష్, రవి శివ తేజ, వి.యశోర, సోనియా నాయుడు, జె.డి.వి ప్రసాద్, బేబీ జస్విత, మాస్టర్ హనీష్ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : వింధ్యా ఫిల్మ్ ప్రొడక్షన్స్
నిర్మాత : జి. సంతోషి రెడ్డి
దర్శకుడు : హేమంత్ కృష్ణ
సంగీతం : రామ్ గోపాల్
కెమెరా : జి.ఎల్. బాబు
ఎడిటర్ : క్రాంతి (ఆర్.కె.)
కొరియోగ్రాఫర్ : జె. చంద్ర కిరణ్
స్టంట్స్ : వై. రవి
పీఆర్వో : సాయి సతీష్
డిజిటల్ టీం : స్టార్ సర్కిల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here