సింగర్ ఎం.ఎం. శ్రీలేఖ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్రం నుండి ‘జినక్ చిక’ పాట విడుదల

0
4
Singer M.M. Sreelekha Unveils ‘Jinaka Chika’ Song from Varun Sandesh’s ‘Yadbhavam Tadbhavati’
Singer M.M. Sreelekha Unveils ‘Jinaka Chika’ Song from Varun Sandesh’s ‘Yadbhavam Tadbhavati’

సింగర్ ఎం.ఎం. శ్రీలేఖ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్రం నుండి ‘జినక్ చిక’ పాట విడుదల

రమేష్ జక్కల దర్శకత్వంలో ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మాతగా ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం యద్భావం తద్భవతి. వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇనయ సుల్తానా, రేణు శ్రీ హీరోయిన్స్ గా నటిస్తుండగా సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్యామ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి మిహిరామ్ సంగీతం అందించగా ఈ చిత్ర పాటలను కే మ్యూజిక్ ద్వారా చిత్ర దండం విడుదల చేస్తుంది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం నుండి ‘జినక్ చిక’ అంటూ సాగే పాటను ప్రముఖ సింగర్ ఎం.ఎం. శ్రీలేఖ గారి చేతుల మీదగా విడుదల చేయడం జరిగింది. బట్టు విజయ్ కుమార్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడగా జేడీ మాస్టర్ కొడుకు చేసారు.

ఈ సందర్భంగా సింగర్ ఎం.ఎం. శ్రీలేఖ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. ఈరోజు నేను “యద్భావం తద్భవతి” చిత్రం నుండి ‘జినక్ చిక’ పాటను విడుదల చేయడం జరిగింది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట పెప్పిగా, మాస్ వెబ్ తో పండగలకు పెళ్ళిలలో, ఫంక్షన్స్ లో అలాగే కాలేజ్ ఫంక్షన్స్ లో ఎంజాయ్ చేసే విధంగా చాలా బావుంది. రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటలు హై ఓల్టేజ్ లో ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే, ఈ పాట కూడా అలాగే ఉంది. మోస్ట్ ఎనర్జిటిక్ హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న ఈ చిత్రానికి రమేష్ జక్కల దర్శకత్వం వహిస్తుండగా ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మిస్తున్నారు. వారికి, అలాగే ఈ చిత్ర బృందం అందరికీ ఈ సినిమా ద్వారా మంచి విజయం వచ్చి నిర్మాతకు కాసుల వర్షం కురవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నుండి రానున్న అన్ని పాటలు ఇలాగే అద్భుతంగా ఉంటాయని ఆశిస్తున్నాను. త్వరలో ఈ చిత్రం థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రేక్షకులంతా ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటీనటులు :
వరుణ్ సందేశ్, ఇనయ సుల్తానా, రేణు శ్రీ, సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు.

సాంకేతిక బృందం :
బ్యానర్ : ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్
దర్శకత్వం : రమేష్ జక్కల
నిర్మాత : ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి
సినిమాటోగ్రఫీ : శ్యామ్
సంగీతం : మిహిరామ్
మ్యూజిక్ పార్ట్నర్ : కే మ్యూజిక్ తెలుగు
పిఆర్ఓ : మధు విఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here