‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా: ప్రీ రిలీజ్ ఈవెంట్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి
ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన ఫాంటసీ ఎంటర్టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన ఈ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకుడు. అక్టోబర్ 2న మూవీ రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో..
హీరో ఫాహద్ ఫాజిల్ మాట్లాడుతూ ‘‘ఇంత అభిమానం ఎప్పుడూ చూడలేదు. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. 90 శాతం లైవ్ లొకేషన్స్ లో షూట్ చేశాం. చాలా మంచి ఫీల్ కలిగింది. ఈ సినిమా షూటింగ్ లో దర్శక నిర్మాతలు, సినిమా యూనిట్ అంతా ఎంతో సపోర్ట్ చేశారు. నిజంగా బాగా ఎంజాయ్ చేస్తూ పని చేశాం. ఈ సినిమా మొదలైనప్పుడే మీ సపోర్ట్ మాకు దొరికింది. మీరు ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. అక్టోబర్ 2 న మా సినిమా చూడండి’’ అన్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్ సారా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు చాలా థాంక్స్. ఫాఫా తో పని చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అక్టోబర్ 2న అందరూ ఈ సినిమా చూడండి..జై ఎన్టీఆర్’’ అన్నారు.
నిర్మాత ఎస్ ఎస్ కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. ఇది ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా. ఇది డెబ్యూ డైరెక్టర్ తీసిన సినిమాలా ఉండదు. ఈ సినిమాలో ప్రతి సీన్ కొత్తగా ఉండేలా దర్శకుడు శశాంక్ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. నిర్మాత అంటే ఇలాగే ఉండాలి అని శోబు గారిని చూసి నేర్చుకున్నా. షోయింగ్ బిజినెస్ అని నా బ్యానర్ పేరు పెట్టిందే కీరవాణి బాబాయ్. ఆయనకు స్పెషల్ థాంక్స్. ఫాహద్ ఫాజిల్ సినిమాలంటే నాకు పిచ్చి. ఆ పిచ్చిలోనే శాశాంక్ కథ విని ఫాహద్ ఫాజిల్ కి ఈ కథ చెప్పాలని అన్నా. ఆయన ఈ సినిమా చేయడం చాలా హ్యాపీ. బాబా (రాజమౌళి) మీ పేరును ఇంకా పైకి తీసుకెళ్లాలని నా కోరిక. ఈ సినిమాను హైదరాబాద్ లోని 75 రియల్ లొకేషన్స్ లో షూట్ చేసాం. సినిమా యూనిట్ మొత్తం ఎంతో కష్టపడింది. తారక్ అన్నాను నోరువిప్పి అడగకుండానే మా సినిమా ఈవెంట్ కి వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్’’ అని అన్నారు.
దర్శకుడు శశాంక్ మాట్లాడుతూ.. ‘‘శోబు సార్, చిన్నా సార్, రాజమౌళి సార్ నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్, చిత్ర యూనిట్ మొత్తానికి పేరుపేరునా కృతజ్ఞతలు. కార్తికేయ మై పిల్లర్, ఈ సినిమాకు అన్నీ ఆయనే. తారక్ అన్న మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం మా యూనిట్ అందరి అదృష్టం’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ మాట్లాడుతూ.. ‘‘అక్టోబర్ 2 న ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. టీం అంతా కలిసి ఎంతో కష్టపడి పని చేశారు. మా లిరికిస్ట్స్, సింగర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు.
ప్రత్యేక అతిథి రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. కార్తికేయ చాలా కసితో తీసిన సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ వీళ్ళు అనుకున్నారు కదా మీరేనా బాహుబలి సినిమా చేసేది. మాకు రాజమౌళి అవసరం లేదు..శశాంక్ యేలేటితో తీసేస్తాం అని ఎంతో కసితో ఈ సినిమా చేశారు. ఇక సినిమా ఎందుకు హిట్ కాదు చెప్పండి. అక్టోబర్ 2 రిలీజ్ కదా, ఆ గాంధీ గారి ఆశిస్సులు మీపై ఉండాలి. ఇలాంటి వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు.
దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా దర్శకుడు శశాంక్, వాళ్ళ గురువు చంద్రశేఖర్ ఏలేటిని మించిన వాడు కావాలని కోరుకుంటూ.. మా అబ్బాయి కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మంచి పేరు రావాలని కోరుకుంటూ, నా అభిమాన నటుడు ఫాహద్ ఫాజిల్ కి మంచి హిట్ పడాలని కోరుకుంటూ, మా మరో అబ్బాయి కార్తికేయ మొదటి సారి సినిమా నిర్మాణంలోకి వచ్చారు. ఇన్ని కోరికలు నిజం కావాలంటే అది స్వార్థం కానీ, ఈ సినిమా ట్రైలర్ కి బాలయ్య గారి సాక్షిగా.. జై బాలయ్య, జై ఎన్టీఆర్, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్.. ఇక ఈ సినిమా సక్సెస్ పక్కా. అందరూ సినిమా చూడండి’’ అన్నారు.
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘ఎమోషనల్ అవుతున్నా. తారక్ తన తమ్ముడి ఫంక్షన్ కోసం వచ్చాడు. ఫాహద్ ఫాజిల్ ఒక్కో సినిమా చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. ఆయన ఒక్కో క్యారెక్టర్ చూసి నిజంగా ఆశ్చర్యపోయా. ఫాఫా తెలుగు ప్రజల్లోకి ఎంతగానో వెళ్లిపోయారు. మూడేళ్ళ క్రిందట శశాంక్ కథ చెప్పాడని వచ్చాడు. ఒక దయ్యాన్ని కిడ్నాప్ చేసిన మనిషి కథ అని ఒక్క లైన్ చెప్పాడు. ఆపై 3 గంటల కథ చెప్పాడు. వెంటనే నేను ఓకే చేశా. ఈ సినిమా చూసి నేను ఏడ్చాను. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా. కార్తికేయ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. అతను హై పొజీషన్ కి వెళ్తాడు అని నమ్ముతున్నా. ఇది నిజంగా గొప్ప సినిమా. అక్టోబర్ 2 న అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు’’ అని అన్నారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘గాయం నుంచి కోలుకున్నా. డ్రాగన్ చెప్పిన సమయానికే విడుదల అవుతుంది. కోవిడ్ అనే టఫ్ సమయంలో ఒక టాలెంట్ నెమ్మదిగా మనలోకి వచ్చింది. అదే ఫాహద్ సార్. మొదటిసారి బెంగళూరులో ఆయన సినిమా చూశా. నాకు అతి తక్కువ మంది యాక్టర్స్ ఇష్టం. అందులో మొదటి వ్యక్తి ఫాహద్ ఫాజిల్. దేశం గర్వించదగ్గ నటుడు ఫాహద్. ఆయన తెలుగులో మొదటిసారి లీడ్ యాక్టర్ గా చేస్తున్న ఫాహద్ గారికి మంచి విజయం దక్కుతుందని నమ్ముతున్నా. దర్శకుడిగా శశాంక్ మొదటి సినిమా ఈ డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఈ సినిమా ఆయనకు గొప్ప విజయం అందించాలని కోరుకుంటున్నా. కార్తికేయ ఈ రోజు నిర్మాతగా ఇక్కడ నిలబడటం చాలా సంతోషంగా ఉంది. మా జక్కన్న చేసే ప్రతి ప్రయత్నంలో కార్తికేయ ఉన్నాడు. ట్రిపులార్, బాహుబలి సినిమాల వెనుక మా తమ్ముడు కార్తికేయనే ఉన్నాడు. కార్తికేయ కెరీర్ లో ఈ సినిమా గొప్ప చిత్రంగా నిలవాలని కోరుకుంటున్నా’’ అన్నారు.



