‘ది ప్యారడైజ్’లో చేసిన సుబ్బు క్యారెక్టర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా సర్ప్రైజ్లు ఉంటాయి. ‘ప్యారడైజ్’ ఫుల్ కమర్షియల్ ప్యాకేజ్‌లా ఉంటుంది. థియేటర్లో అడ్రినలిన్ రష్ ఇస్తుంది: హీరోయిన్ కయాదు లోహార్
న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కయాదు లోహార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
ప్యారడైజ్‌లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-‘ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి పాత్రలో కనిపిస్తాను. తనని అందరూ సుబ్బు అని పిలుస్తుంటారు. ఇందులో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి. అవన్నీ మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాలి. జడల్ జర్నీలో లవ్ పార్ట్నర్గా కనిపిస్తాను. అలాగే నాకంటూ ఒక జర్నీ ఉంటుంది. అది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.
-నాది చాలా పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్ర. అలాగే కథలో చాలా కీలకమైన పాత్ర. సుబ్బు క్యారెక్టర్ గురించి అప్పుడే ఎక్కువ రివీల్ చేయకూడదు. నేను చేసిన పాత్రలన్నిటికీ ఇది చాలా డిఫరెంట్. నాని గారు, శ్రీకాంత్ గారు, అనిరుద్ గారితో కలిసి ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ లో భాగం కావడం గొప్ప ఎక్స్పీరియన్స్.
ఈ అవకాశం ఎలా వచ్చింది?
-‘డ్రాగన్’ సినిమా చూసిన తర్వాత నేను ఈ క్యారెక్టర్ చేయగలనని శ్రీకాంత్ గారు బిలీవ్ చేశారు. కథ చెప్పారు. తర్వాత లుక్ టెస్ట్ చేసి ఓకే చేశారు. ఇది నా కెరీర్లో చాలా పెద్ద ప్రాజెక్ట్.
నాని గారితో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
-ఈ సినిమాలో నాని గారు జడలతో కనిపిస్తారు. అలా నటించడం, యాక్షన్ చేయడం అంత ఈజీ కాదు. కాకపోతే నాని గారు ఆ క్యారెక్టర్‌ను చాలా కాన్ఫిడెంట్‌గా, వండర్‌ఫుల్‌గా చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. నాని గారు వెరీ స్వీట్, హంబుల్ పర్సన్. ఆయన జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
డైరెక్టర్ శ్రీకాంత్ గారి గురించి?
-శ్రీకాంత్ గారు చాలా డిఫరెంట్ డైరెక్టర్. ఆయనలాంటి డైరెక్టర్లు చాలా అరుదుగా ఉంటారు. ఆయనకు గొప్ప విజన్ ఉంది. తనకి ఏం కావాలో చాలా క్లారిటీ ఉంటుంది. నాకు చాలా చాలెంజెస్ ఇచ్చారు. మేము పడిన కష్టానికి తగిన ఫలితం వస్తుందని నమ్ముతున్నాను.
మీ ఫేవరేట్ క్యారెక్టర్ ఏమిటి?
-ఇందులో నాని గారి క్యారెక్టర్ నా ఫేవరేట్. అలాగే మోహన్ బాబు గారి క్యారెక్టర్, రాఘవ్ గారి క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ అన్నీ థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి.
మీ డ్రీమ్ రోల్ ఏమిటి?
-యాక్షన్ సినిమాలు, స్పోర్ట్స్ సినిమాలు చేయాలని ఉంది. అలాగే బయోపిక్ కూడా అవకాశం వస్తే చేయాలని ఉంది.
అన్ని పరిశ్రమల్లో పనిచేస్తున్నారు కదా.. ఏ పరిశ్రమ మీకు బాగా ఇష్టం?
-ప్రతి పరిశ్రమ నుంచి నాకు ఎంతో ప్రేమ లభిస్తుంది. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. అన్ని పరిశ్రమల్లో పని చేసే అవకాశం రావడం, ప్రేక్షకుల ప్రేమ దక్కడం ఆనందంగా ఉంది.
దర్శకత్వం, నిర్మాణం కాని చేసే అవకాశం ఉందా?
-ప్రస్తుతానికైతే నా దృష్టి అంతా నటన మీదే ఉంది.
నిర్మాత సుధాకర్ గారి గురించి?
-సుధాకర్ గారు చాలా స్వీట్ అండ్ జెన్యూన్ పర్సన్. ఆయనకు సినిమాల పట్ల చాలా ప్యాషన్ ఉంటుంది. ఆయన నిర్మాణంలో పని చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇది చాలా భారీ ప్రాజెక్ట్. ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు.
-‘ప్యారడైజ్’ బిగ్ స్క్రీన్ పై ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. స్టోరీ, యాక్షన్, మ్యూజిక్.. అంతా ఫుల్ కమర్షియల్ ప్యాకేజ్‌లా ఉంటుంది. అడ్రినలిన్ రష్ ఇస్తుంది.
అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి?
-సూర్య గారితో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే మారి సెల్వరాజ్ గారితో ఒక సినిమా చేస్తున్నాను.



