సెప్టెంబర్ 25 తర్వాత నా పేరు మీరు మర్చిపోలేరు. తప్పకుండా ‘అనుమాన పక్షి’ మీ అందరికీ చాలా మంచి వినోదాన్ని ఇస్తుంది : హీరో రాగ్ మయూర్

0
4
Anumana Pakshi Pre Release Press Meet
Anumana Pakshi Pre Release Press Meet
డీజే టిల్లు ఎలా సర్‌ప్రైజ్ చేసిందో ‘అనుమాన పక్షి’ కూడా ఆడియన్స్ ను 100% సర్‌ప్రైజ్ చేస్తుంది. సినిమా చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది: ప్రెస్ మీట్ లో డైరెక్టర్ విమల్ కృష్ణ

అనుమాన పక్షి యూనిక్ ఫిలిం. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. తప్పకుండా చాలా పెద్ద విజయం సాధిస్తుంది: హీరో రాగ్ మయూర్

డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 25న ‘అనుమాన పక్షి’ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా  మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్ లో హీరో రాగ్ మయూర్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మా నాన్నగారు ఎప్పుడూ సమయాన్ని వృథా చేయకూడదని చెప్పేవారు. నేను యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయిన తర్వాత ఒక్క క్షణం కూడా వృథా చేయలేదు. నటుడిగా ప్రతిక్షణం మెరుగవడానికి ప్రయత్నించాను. యాక్టింగ్ నా ఊపిరి. ఇప్పుడు ‘అనుమాన పక్షి’తో హీరోగా వస్తున్నాను. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. డిజే టిల్లు పెద్ద హిట్ తర్వాత విమల్ కృష్ణ నాతో సినిమా చేయాలనుకున్నారు. ఈ విషయంలో ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి కథ ఎక్కడా లేదు. ఇలాంటి కథపై ఎవరూ సినిమా చేయలేదు. దీనిపై మేము తొమ్మిది నెలలు వర్క్ చేశాం. సెప్టెంబర్ 25న ఒక అద్భుతమైన సినిమా మీ ముందుకు రాబోతోంది. ఇలాంటి క్యారెక్టర్‌ను తెలుగు సినిమాలో మీరు చూసి ఉండరు. అది నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. సినిమా విషయంలో మేము చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. తప్పకుండా చాలా పెద్ద విజయం సాధిస్తుంది. మా నిర్మాతలు మాకు చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారు. శ్రీ చరణ్ పాకాల చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి పాటకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా విషయంలో నేను చాలా నేర్చుకున్నాను. మా టీమ్ అంతా నాకు ఎంతో సపోర్ట్ చేసింది. మెరీన్ సినిమాలో అద్భుతంగా నటించింది. ఐదేళ్ల క్రితం ‘సినిమా బండి’ సినిమాతో ‘నీ పేరేమి?’ అనే డైలాగ్‌తో మీ అందరికీ పరిచయమయ్యాను. మీరందరూ నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. సెప్టెంబర్ 25 తర్వాత నా పేరు మీరు మర్చిపోలేరు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ చాలా మంచి వినోదాన్ని ఇస్తుంది.”

డైరెక్టర్ విమల్ కృష్ణ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమా మీద నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. 100% కొడుతున్నాం. ఇది నేను ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చెప్పట్లేదు. నా ఫిల్మ్‌ను గట్ ఫీలింగ్ తో నమ్ముతున్నాను. ‘డీజే టిల్లు’ మీకు ఎలా సర్‌ప్రైజ్ చేసిందో, ఈ సినిమా కూడా మిమ్మల్ని 100% సర్‌ప్రైజ్ చేస్తుంది. ఈ జర్నీలో నాకు చాలా సపోర్ట్ చేసిన స్టేజ్ మీద ఉన్న అందరికీ థాంక్యూ. చోటా గారు ఎడిటింగ్‌కు వచ్చిన తర్వాత ‘అనుమాన పక్షి’ జర్నీ చాలా ఈజీ అయింది. శ్రీ చరణ్ మరోసారి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే నా డైరెక్షన్ టీమ్ అందరికీ థాంక్యూ. రాగ్ మయూర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. ఈ సినిమా నా టీమ్ కోసం హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డిజే టిల్లుకి ఇచ్చిన ప్రేమను ‘అనుమాన పక్షి’కి కూడా అలాంటి ప్రేమ ఇస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుంది.

హీరోయిన్ మెరీన్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమాలో నటించడం, ఈ సినిమాతో మీ ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ. శ్రీ చరణ్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా మ్యూజిక్‌ను చాలా ఎలివేట్ చేసింది. మా నిర్మాతలకు థాంక్యూ. ఈ సినిమాలో కన్యా క్యారెక్టర్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. తప్పకుండా ఈ సినిమా మీ అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది.”

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. విమల్ తో ‘డీజే టిల్లు’ తర్వాత ఇది సెకండ్ కొలాబరేషన్. ఈ టీమ్ అందరూ నాకు చాలా క్లోజ్. రాగ్ మయూర్ ఈ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్. చాలా అద్భుతంగా చేశాడు. ఇది చాలా ఫన్‌గా ఉండే సినిమా. కొన్ని సినిమాలు హ్యాపీగా చూడటానికి రిలాక్స్ అవ్వడానికి ఉంటాయి. ఇది అలాంటి సినిమా. నా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్యూ. రమణ గోగుల గారికి థాంక్యూ. ఇది నా 50వ సినిమా. ఈ సినిమాలో భాగం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.”

ప్రొడ్యూసర్ రాజీవ్ చిలక మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. అందరూ చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. ఇది స్టోరీ, కథనం, ప్రెజెంటేషన్‌లో డిఫరెంట్‌గా ఉండే సినిమా. నటీనటులు, టెక్నికల్ టీమ్ అందరూ అద్భుతంగా చేశారు. ఇది చాలా యూనిక్ ఫిల్మ్. తెలుగు సినిమాలో ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. సినిమా విషయంలో చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నాం. రాగ్ మయూర్ అద్భుతంగా నటించారు. విమల్ ఈ కథ చెప్పగానే ఎక్సయిట్ అయ్యాను. అజయ్ గారు, రాశి గారు అందరూ చాలా సపోర్ట్ చేశారు. శ్రీ చరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. శ్రవణ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఎడిటర్ చోటా గారు చాలా అద్భుతంగా కట్ చేశారు. సినిమా చూసి నేను చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. తప్పకుండా అందరూ సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ సినిమా నచ్చుతుంది. ఇది చాలా ఫన్ ఎంటర్టైన్మెంట్ సినిమా. యూత్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు.”

ప్రొడ్యూసర్ మేఘా మాట్లాడుతూ.. “విమల్ ఈ కథ చెప్పినప్పుడే సినిమా అదిరిపోతుంది అనిపించింది. శ్రీ చరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చోటా ప్రసాద్ గారి ఎడిటింగ్‌తో సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. సినిమా అద్భుతంగా వచ్చింది. మీ అందరి ప్రేమ, అభిమానం కావాలి. ఈ సినిమా మీ అందరి అభిమానంతో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.”

ఎడిటర్ చోటా ప్రసాద్ మాట్లాడుతూ.. “సినిమా 25న రిలీజ్ కాబోతోంది. ఇందులో కంటెంట్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ‘డీజే టిల్లు’ తర్వాత సిద్ధు పేరును అందరూ ‘డీజే టిల్లు’ అనే పిలిచేవారు. ఈ సినిమా తర్వాత రాగ్ మయూర్‌ను అందరూ ‘అనుమాన పక్షి’ అని పిలుస్తారు. అంత సినిమా ఎంటర్టైన్‌మెంట్, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతోంది. సినిమాలో అందరూ పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.” ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here