‘ఇట్లు అర్జున’ బ్యూటీఫుల్ సినిమా. నిర్మాతగా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అనీష్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ లో అద్భుతంగా పర్ఫార్మ్ చేశాడు. టీజర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత వెంకీ కుడుముల
– అనీష్, అనస్వర రాజన్, తమన్, వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ ‘ఇట్లు అర్జున’ టీజర్ లాంచ్
స్టార్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. ఈ సినిమాతో అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, డెబ్యూ దర్శకుడు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్, ఇప్పటికే విడుదలైన రెండు పాటలు, ఇతర ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు మేకర్స్ టీజర్ రిలీజ్ లాంచ్ చేశారు.
మూగ కుర్రాడైన అనీష్.. తన ప్రేమించిన కీర్తి(అనస్వర) తో మాట్లాడాలని, ఆమెను దగ్గరగా చూడాలని కోరుకుంటాడు. అతడిని పోలీసులు, గూండాలు వెతుకుతుండటంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. తొలి సినిమాతోనే ఛాలెంజింగ్ పాత్రలో అనీష్ ఆకట్టుకున్నాడు. హ్యూమర్, ఎమోషన్, యాక్షన్‌తో పాత్రను ఎనర్జిటిక్‌గా ప్రజెంట్ చేశాడు. అనస్వర రాజన్ చార్మింగ్‌గా కనిపించింది. ఇద్దరి కెమిస్ట్రీ బాగుంది. దర్శకుడు మహేష్ ఉప్పల హ్యూమర్, ఎమోషన్, థ్రిల్‌ను బ్యాలెన్స్ చేస్తూ టీజర్‌ను ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. రాజా మహాదేవ్ విజువల్స్ అద్భుతంగా వున్నాయి. థమన్ మ్యూజిక్ టీజర్ ని మరింత ఎలివేట్ చేసింది. వెంకీ కుడుముల వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. టీజర్ సినిమాపై అంచనాలని మరింత పెంచింది.
టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో అనీష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఉండడానికి మెయిన్ రీజన్ వెంకీ అన్న. ఈ క్యారెక్టర్ చేయగలను అని నమ్మింది ఆయనే. ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి కారణం కూడా ఆయనే. ఈ కథని మహేష్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. అర్జున్ క్యారెక్టర్‌కి కనెక్ట్ అయిపోయాను. ఈ సినిమా మీకు గుర్తుండిపోతుంది. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మహేష్‌కి థాంక్యూ. ఈ సినిమా ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. యాక్షన్ నేను చాలా ఎంజాయ్ చేశాను. యాక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. అనస్వర కీర్తి క్యారెక్టర్ని అద్భుతంగా చేసింది. ఈ సినిమా చూసిన తర్వాత కీర్తి పాత్రలో తనని చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు. మన నటీనటులందరికీ థాంక్యూ. ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన తమన్ అన్నకి థాంక్యూ. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మేమందరం కొత్త వాళ్లం. అక్టోబర్ 30న థియేటర్‌కి వస్తున్నాం. అర్జున్ మాటలు మీకు వినిపించకపోవచ్చు.. కానీ తన ప్రేమ గట్టిగా కనిపిస్తుంది. అందరికీ థాంక్యూ సో మచ్.
నిర్మాత వెంకీ కుడుముల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా నాతో సినిమాలు నిర్మించిన ఉషా ముల్పురి, చిన్నబాబు గారు, నాగవంశీ గారు, మైత్రీ రవి గారు, నవీన్ గారికి థాంక్యూ సో మచ్. నేను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వాళ్ల కష్టం చూశాను. నేను ప్రొడ్యూసర్ అయ్యాక అది పర్సనల్‌గా ఫీల్ అయ్యాను. ఇంతకుముందు డైరెక్టర్‌గా ఉన్నప్పుడు సీన్ గురించి మాత్రమే ఆలోచించే వాడిని. ఇప్పుడు సీన్ గురించి, బడ్జెట్ గురించి కూడా ఆలోచిస్తున్నాను. ఒక డైరెక్టర్ ఇలా ప్రొడ్యూసర్ అవడం వల్ల మిగతా క్రాఫ్ట్స్ మీద కూడా నాకు చాలా మంచి అవగాహన వచ్చిందని నమ్ముతున్నాను. ప్రొడ్యూసర్స్ వల్లే తెలుగు సినిమాకి కొత్త డైరెక్టర్లు, హీరోలు వస్తున్నారు. వారికి హ్యాట్సప్. ఇందులో అనీష్ పర్ఫార్మెన్స్ చూశాను. తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నేను చాలా మంచి నిర్ణయం తీసుకున్నాను అనిపించింది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీల్ అవుతారు. నేను నా తొలి సినిమాకి కన్నడలో ‘కిరాక్ పార్టీ’ సినిమా చూసి రష్మికను తీసుకున్నాను. తను ఎంతో పెద్ద నటిగా ఎదిగింది. ఎన్నో అచీవ్మెంట్స్ చేసింది. ఈ సినిమాలో అనీష్ని తీసుకున్నాను. తనని నేను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నందుకు చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. అలాగే మహేష్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీస్ చేశాడు. తన ప్యాషన్ నాకు చాలా నచ్చింది. తను చాలా టాలెంటెడ్. తన టాలెంట్‌ని నమ్మాను. తను చెప్పిన కథను స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. అలాగే రాజాను డీఓపీగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి విజువల్స్ ఇచ్చాడు. నాగార్జున గారి 100వ సినిమాకి ఈయనే డీఓపీగా పనిచేస్తున్నారు. ప్రతి డైరెక్టర్ ఒక సినిమాని నిర్మిస్తే అన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ వస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. నిర్మాతగా నేను, దర్శకుడు, హీరో.. అందరం కొత్త వాళ్లం. మీరందరూ ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కొత్త టాలెంట్ మరెంతమంది వస్తారో.. చాలా మంచి సినిమాలు వస్తాయి. అక్టోబర్ 30న తప్పకుండా అందరూ సినిమాని థియేటర్లో చూస్తారని కోరుకుంటున్నాను.”

అనస్వర రాజన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘ఇట్లు అర్జున’ నేను తెలుగులో సైన్ చేసిన ఫస్ట్ ఫిలిం. ఇది నాకు చాలా స్పెషల్. మీ అందరి సపోర్ట్‌తో నేను ఇంకా ఎన్నో సినిమాలు ఇక్కడ చేయాలని కోరుకుంటున్నాను. మా టీం గురించి చాలా చెప్పాలి. కీర్తి క్యారెక్టర్ చేయడం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇందులో ఉండే తన ఇన్నోసెంట్ హ్యాపీనెస్‌ని చాలా ఎంజాయ్ చేశాను. తప్పకుండా కీర్తి మీ అందరికీ చాలా నచ్చుతుంది. అలాగే అనీష్ ఇంకా నచ్చుతాడు.
అక్టోబర్ 30న మీరందరూ థియేటర్లో ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థియేటర్స్‌లో కలుద్దాం.”
దరాకుడు మహేష్ ఉప్పల మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ కథని నమ్మిన వెంకీ గారికి థాంక్యూ. ఆయన నన్ను నమ్మారు. నేను సినిమా బాగా తీయగలను అనే నమ్మకాన్ని అనీష్ ఇచ్చాడు. అనీష్ ఎంత కష్టపడ్డాడో మీరు ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. తను ఒక కొత్త కుర్రాడు. కానీ చాలా ఛాలెంజింగ్‌గా తీసుకొని ఈ క్యారెక్టర్ చేశాడు. తన కష్టం నచ్చితే మీరు తనని ఎంకరేజ్ చేయండి. తను చాలా మంచి సినిమాలు చేస్తాడు. అనస్వర అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అందరూ కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మా కంటెంట్ నచ్చితే అందరూ సపోర్ట్ చేయండి.
తమన్ గారు ఈ సినిమాని ఎంత ప్రేమించి చేశారో అక్టోబర్ 30వ తేదీన మీకు అర్థమవుతుంది. వినిపిస్తుంది. తమన్ గారికి థాంక్యూ. మానసతో కలిసి ఈ కథను చాలా ఇష్టపడి రాశాను. అందరూ ఇష్టపడి తీశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను.
మానస శర్మ మాట్లాడుతూ.. ఈ టీం నాకు చాలా స్పెషల్. అనీష్ మూగ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. అది అంత ఈజీ కాదు. దాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకొని చేశాడు. ఈ సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ ఇష్టపడతారు. అలాగే అనస్వర పాత్ర కూడా అద్భుతంగా ఉంది. మీరందరూ తన ప్రేమలో పడిపోతారు. ఖచ్చితంగా ఇది ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది. తప్పకుండా మీరందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ ఈవెంట్ లో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.



