బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న “రోమాంచకం” సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్

0
6
Romanchakam Title Song
Romanchakam Title Song
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న “రోమాంచకం” సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్

సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మరోవైపు ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే “రోమాంచకం” సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘రాధా రమణ’ సాంగ్ కు మ్యూజిక్ లవర్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

https://www.youtube.com/watch?v=OnkGfsmGIPc

“రోమాంచకం” సినిమా టైటిల్ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ వాసుకీ వైభవ్ మంచి బీట్, మెలొడీ కలిపి కంపోజ్ చేసి ఎనర్జిటిక్ గా పాడారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ తను అలవోకగా రాయగల మెచ్యూర్డ్ లిరిక్స్ అందించారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే – ‘ఈ లోకం ఎంతో కొత్తగా, మారిపోయో ఈ దినం, లోకంలో ఉందీ కేవలం నువ్వు నేను ఇద్దరం, గడియారం లేని సమయాలు, కొలమానం లేని సరదాలు, అంతా మనకు సొంతాలు, విసుగంటూ రాని విషయాలు, విషయాలే లేని వివరాలు, ఎంతో ఎంతో మధురాలు, ఇలా ఇలా మొదటిసారి మొదలయ్యిందే, రోమాంచకం, రోమాంచకం, రోమాంచకం, రోమాంచకం…’ అంటూ ఫస్ట్ లవ్ లోని ఎగ్జైట్ మెంట్, ప్రేమికులు మాత్రమే ఫీలయ్యే క్యూట్ మూవ్ మెంట్స్ ను చూపిస్తూ ఈ పాటను బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు.

“రోమాంచకం” సినిమా ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు సెప్టెంబర్ 3న తెరపైకి రాబోతోంది.

నటీనటులు – సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్, ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్, తదితరులు

టెక్నికల్ టీమ్  
—————————–
డీవోపీ – పవన్ పప్పుల
మ్యూజిక్ – వాసుకి వైభవ్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ భాను
పీఆర్ఓ – సురేష్ ( ఎస్. కె. మీడియా )
మార్కెటింగ్- వాల్స్ అండ్ ట్రెండ్స్
బ్యానర్ – భద్రకాళీ పిక్చర్స్
ప్రెజెంటర్ – సందీప్ రెడ్డి వంగా
ప్రొడ్యూసర్ – ప్రణయ్ రెడ్డి వంగా
రచన, దర్శకత్వం – వేణుగోపాల్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here