యదార్థ సంఘటనలతో ‘మేరంగి జంక్షన్’.. ఇంటెన్సివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో వస్తున్న షకలక శంకర్

0
3
Shakalaka Shankar Merangi Junction
Shakalaka Shankar Merangi Junction

యదార్థ సంఘటనలతో ‘మేరంగి జంక్షన్’.. ఇంటెన్సివ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో వస్తున్న షకలక శంకర్!

యువన్ టూరింగ్ టాకీస్ పతాకం పై మాస్టర్ దివ్యాన్ష్ సమర్పణలో షకలక శంకర్,
సాహితీ దాసరి, వినీత కందాల, సంపత్, ప్రభాకర్, రాధా కోహినూర్ ముఖ్య తారాగణంతో శివ గణేష్ రచన దర్శకత్వం లో రవి కృష్ణ గొల్లు, రాజేష్ గంగునాయుని, పెద్దింటి మోహన రావు, చొక్కపు రాములమ్మ మరియు సీర గణపతి నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం “మేరంగి జంక్షన్”.

ఒక పాట మరియు ఒక ఫైట్ మినహా టాకీ షూటింగ్ పూర్తియింది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ “ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మేరంగి అనే ఊరిలో జరిగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథే ఈ “మేరంగి జంక్షన్”. యదార్థ సంఘటనల సమాహారంగా తెరకెక్కిన ఈ చిత్రం, పూర్తి కొత్త తరహా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ల స్థాయిలో ప్రేక్షకులను అలరించేవిధంగా ఉంటుంది. షకలక శంకర్ ఏజెన్సీ ఏరియా లో పోలీస్ పాత్రలో తన నటవిశ్వరూపం చూపించబోతున్నారు.

మొదటి సీన్ నుండి క్లైమాక్స్ వరకు ఊహించని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోంది. ఒక పాట మరియు ఒక ఫైట్ మినహా 47 రోజుల్లో టాకీ మరియు రెండు పాటలు పూర్తిచేశాం. అజయ్ పట్నాయక్ సంగీతంలో మేరంగి జంక్షన్ టైటిల్ సాంగ్, నీల వేణి అనే మెలోడీ పాట ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే కిరణ్ చేబ్రోలు సినెమాటోహ్రాఫీ చిత్రానికి మంచి అస్సేస్ట్ ఆయుతుంది. 2026 చివరి మాసంలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తునట్టు చిత్ర బృందం తెలిపింది.

బ్యానర్: యువన్ టూరింగ్ టాకీస్
సమర్పణ: మాస్టర్ దివ్యాన్ష్
చిత్రం పేరు: మేరంగి జంక్షన్

నటీనటులు: షకలక శంకర్, సాహితీ దాసరి, వినీత కందాల, సంపత్ కుమార్, ప్రభాకర్ చొక్కపు, రాధా కోహినూర్, తదితరులు

సంగీతం: అజయ్ పట్నాయక్
ఎడిటర్: పిజె రామ్
డి ఓ పి: కిరణ్ చేబ్రోలు
పి ఆర్ ఓ: పాల్ పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కుమార్ చలమల
నిర్మాతలు: రవి కృష్ణ గొల్లు, రాజేష్ గంగునాయునీ, పెద్దింటి మోహన రావు, చొక్కపు రాములమ్మ మరియు సీర గణపతి నాయుడు
రచన, దర్శకత్వం: శివ గణేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here