‘కొరియన్ కనకరాజు’ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్. సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో ఒక రోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రీమియర్స్ వేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి థియేటర్‌లో ఎంజాయ్ చేసే సినిమా: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఎంటర్‌టైనింగ్ టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన రెండు పాటల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ‘కొరియన్ కనకరాజు’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ భీమవరంలో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ… అందరికీ హాయ్. ‘కొరియన్ కనకరాజు తో ఆగస్టు 7న థియేటర్లలో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతోంది. డెఫినెట్‌గా మీరందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. 2018లో ‘తొలిప్రేమ’ సినిమా ఈవెంట్ కోసం ఇక్కడికి వచ్చాను. ఈ కాలేజ్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. ‘తొలిప్రేమ’ తర్వాత మళ్లీ ‘కొరియన్ కనకరాజు’ ఈవెంట్‌ను మీ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మీ అందరి ఉత్సాహం చూస్తుంటే ‘తొలిప్రేమ’ మ్యాజిక్ ఈ సినిమాతో మళ్లీ రిపీట్ అవుతుందనిపిస్తోంది. ఈ సినిమాతో నాకు, మా టీమ్ అందరికీ పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్స్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. గాంధీ చాలా మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. తన కెరీర్‌లో మరో పెద్ద హిట్ ఈ సినిమా అవుతుందని నమ్ముతున్నాను. నన్ను ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించారు. తమన్ ఏ హీరో సినిమా అయినా తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఈ విషయంలో ఆయన ఎప్పుడూ సక్సెస్ అవుతారు. తమన్‌తో ఇది నాకు మూడో సినిమా. ఈ సినిమా రీ-రికార్డింగ్ చూశాను. ఈ చిత్రంలో మ్యూజిక్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. చివరి పది రోజులుగా నేను తమన్ దగ్గరే ఎక్కువగా ఉన్నాను. సినిమాకు ఆయన ప్రాణం పోశారు. రితిక గ్రేట్ కో-స్టార్. ‘కొరియన్ కనకరాజు’తో తన విజయ ప్రయాణం కొనసాగాలని కోరుకుంటున్నాను. సత్య క్రేజీ కమెడియన్. ఈ సినిమాలో ‘కృష్ణప్ప’ పాత్ర చెప్పినప్పుడే సత్య తప్ప ఇంకెవరూ గుర్తుకు రాలేదు. మా ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. మిగతా టెక్నికల్ టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రతి సినిమాకు సపోర్ట్ చేస్తూ మాకు ధైర్యం ఇస్తున్న అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు గర్వపడే సినిమా ఇది. సినిమా ప్రేమించే ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ‘ఓజీ’తో సక్సెస్ స్టార్ట్ అయింది, సంక్రాంతి కి రఫ్ఫాడించారు. ‘పెద్ది’తో చరణ్ అన్న ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారో అందరికీ తెలుసు. వాళ్ల రేంజ్‌లో కాకపోయినా, నా రేంజ్‌లో ఈ సక్సెస్‌ను కొనసాగించాలని ప్రయత్నిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్యూ. తప్పకుండా మరోసారి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మా సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో ఒక రోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రీమియర్స్ వేస్తున్నాం. ఆగస్టు 6 రాత్రి నుంచే ‘కొరియన్ కనకరాజు’ థియేటర్లలో అందుబాటులో ఉంటుంది. మీ అందరినీ అలరిస్తుందనే నమ్మకంతో ఒక రోజు ముందే మీ ముందుకు వస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.”
మంతెన రామరాజు మాట్లాడుతూ..”అందరికీ నమస్కారం. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వరుణ్ తేజ్ గారు ప్రతి సినిమాలో భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇంతకుముందు ‘తొలిప్రేమ’ ఈవెంట్ కోసం ఇక్కడికి వచ్చారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఈ సినిమా దానికంటే పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. వరుణ్ తేజ్ గారు మరెన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”
నిశాంత్ మాట్లాడుతూ:వరుణ్ తేజ్ గారు ‘తొలిప్రేమ’ సినిమా కోసం ఇక్కడికి వచ్చారు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. దానికంటే పెద్ద బ్లాక్‌బస్టర్‌గా ‘కొరియన్ కనకరాజు’ నిలవాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఆగస్టు 7న అందరూ థియేటర్లలో ఈ సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను.”
హీరోయిన్ రితిక నాయక్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా దర్శకుడు గాంధీ గారికి థ్యాంక్యూ. ఈ సినిమాలో నేను చేసిన ‘చైత్ర’ పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గాంధీ గారు చాలా హార్డ్‌వర్కింగ్ డైరెక్టర్. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. వరుణ్ తేజ్ గారు ‘కొరియన్ కనకరాజు’గా మిమ్మల్ని అందరినీ తప్పకుండా అలరిస్తారు. ఆయనతో మరోసారి కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్స్ కి ధన్యవాదాలు. ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. వారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. మా టీమ్ అందరికీ థ్యాంక్యూ. సినిమా కోసం మేమంతా చాలా కష్టపడ్డాం. ఆగస్టు 7న థియేటర్లలో మీ ప్రేమను చూపించాలని కోరుకుంటున్నాను. అందరం థియేటర్లలో కలుద్దాం.”
తమన్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. భీమవరం నాకు చాలా స్పెషల్. ‘తొలిప్రేమ’ సినిమా కోసం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మళ్లీ రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ‘తొలిప్రేమ’ సినిమా ఇచ్చిన వరుణ్ గారికి థ్యాంక్యూ. ‘కొరియన్ కనకరాజు’ చాలా స్పెషల్ ఫిల్మ్. యూవీ క్రియేషన్స్, వంశీ, రాజీవ్ అందరూ ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు. గాంధీ చాలా మంచి విజన్‌తో ఈ సినిమా తీశారు. నిన్ననే సినిమా పూర్తిగా చూశాను. చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది
నల్గొండ గద్దర్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. ఈ సినిమాలో ఒక మంచి పాట పాడే అవకాశం ఇచ్చినందుకు హీరో వరుణ్ తేజ్ గారికి, సంగీత దర్శకుడు తమన్ గారికి, అలాగే మా నిర్మాతలకు ధన్యవాదాలు. పాటలకు ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అంతే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మీరందరూ ఆగస్టు 7న థియేటర్లలో ఈ సినిమాను చూసి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. ఈ వేడుకలో మూవీ టీం అందరూ పాల్గొన్నారు.



