ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా “1=100” టీజర్ లాంచ్

0
11
1=100 teaser launch event
1=100 teaser launch event

ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా “1=100” టీజర్ లాంచ్

శకుంతల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాబా మైలవరం దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “1=100” టీజర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ నిర్మాత రిజ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
వెస్ట్రన్ స్టైల్ విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను, సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది. అనిల్ కుమార్ వేగూరు సినిమాటోగ్రఫీ, కెన్నీ చైతన్య సంగీతం, నందమూరి హరి ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. రాజు ఎంటర్‌టైనర్స్, స్పార్కిల్ డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పటికే టీజర్‌కు వస్తున్న భారీ రెస్పాన్స్ తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని, త్వరలోనే సినిమా మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చిత్ర బృందం పేర్కొంది.

ఈ చిత్రానికి
* దర్శకత్వం : బాబా మైలవరం
* డీఓపీ: అనీల్ కుమార్ వేగూరు
* సంగీతం: కెన్నీ చైతన్య
* ఎడిటర్: నందమూరి హరి
* కొరియోగ్రఫీ: సూర్యాస్ మాస్టర్, జోజో
* ఫైట్స్: కృష్ణ ఎస్.ఎం. రాజు, డైమండ్ వెంకట్
* ఆర్ట్ డైరెక్టర్: నానాజీ
* పోస్ట్ ప్రొడక్షన్: డిజిక్వెస్ట్
* PRO: శ్రీపాల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here